iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ సెంటిమెంట్.. RRR హిస్టరీ రిపీట్..!

  • Published Oct 29, 2024 | 11:45 AM Updated Updated Oct 29, 2024 | 11:55 AM

Game Changer Updates: రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పై ఫోకస్ పెట్టాడు. చరణ్ పై ఇప్పుడు చాలా ఒత్తిడి కూడా ఉంది. అయితే రీసెంట్ గా గేమ్ చెంజర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అది చూసి ఈసారి 2000కోట్లు పక్కా అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. మళ్ళీ మగధీర హిస్టరీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Game Changer Updates: రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పై ఫోకస్ పెట్టాడు. చరణ్ పై ఇప్పుడు చాలా ఒత్తిడి కూడా ఉంది. అయితే రీసెంట్ గా గేమ్ చెంజర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అది చూసి ఈసారి 2000కోట్లు పక్కా అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. మళ్ళీ మగధీర హిస్టరీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 29, 2024 | 11:45 AMUpdated Oct 29, 2024 | 11:55 AM
రామ్ చరణ్ సెంటిమెంట్..  RRR హిస్టరీ రిపీట్..!

రామ్ చరణ్ కు ఇప్పుడు దేవర రేంజ్ సునామి క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే RRR లో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్.. ఇప్పుడు ఆ రేంజ్ హిస్టరీని కూడా షేర్ చేసుకోవాల్సిందే. ఆచార్యలో అంటే గెస్ట్ రోల్ కాబట్టి సినిమా ఫెయిల్ అయినా అంత పట్టించుకోలేదు. కానీ గేమ్ ఛేంజర్ అలా కాదు.. ఈ సినిమా కనుక డిజాస్టర్ అయితే.. రాజమౌళి మూవీస్ తర్వాత ఫెయిల్ అయినా హీరోల లిస్ట్ లో చరణ్ కూడా యాడ్ అవుతాడు. సో అలాంటివి లేకుండా ఉండడం కోసం చరణ్ తన రాజమౌళి సెంటిమెంట్ నే రిపీట్ చేస్తున్నాడు. మగధీరలో ‘ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు’ అనే డైలాగ్ తో.. ఒకేసారి 100 మందితో ఫైట్ చేశాడు.. అలాగే RRR లో లాఠీతో ఒకేసారి 1000 మందితో ఫైట్ చేశాడు. ఇక ఇప్పుడు 2000 మందితో ఫైట్ ను చేయబోతున్నాడట.

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో చాలా మంది కత్తులు , కర్రలతో చరణ్ వైపు దూసుకురావడం. అయినా సరే ఏ మాత్రం జంకకుండా చరణ్ అలానే కూర్చుని ఉండడం. ఇలాంటి సీన్ ను చూపించారు. ఈ లెక్కన చూస్తే ఆర్ఆర్ఆర్ , మగధీర తరహాలోనే ఏదైనా ఒక ఫైట్ సీన్ ఉంటుందేమో అని అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ కు ఇలాంటి ఫైట్స్ బాగా కలిసొచ్చాయని చెప్పి తీరాల్సిందే. ధ్రువ సినిమాలోనూ ఇలాంటి ఓ ఫైట్ ఉంది. ఇలా చూసినట్లయితే చరణ్ గుంపుతో ఫైట్ చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు కూడా వర్క్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వర్క్ అవుట్ అయితే కనుక.. చరణ్ మగధీర హిస్టరీ రిపీట్ చేసినట్లే.ఇండియన్ 2 తో ట్రాక్ తప్పిన శంకర్ కూడా మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చినట్లే.

నిజానికి ఇండియన్ 2 డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటి నుంచి.. గేమ్ ఛేంజర్ మీద అనుమానాలు పెరిగిపోయాయి. అటు రిలీజ్ డేట్ విషయంలోనూ ప్రేక్షకులను అలానే కన్ఫ్యూజ్ చేసి.. ఫైనల్ గా సంక్రాంతికి ఫిక్స్ చేశారు. పైగా మూవీ నుంచి కూడా సాలిడ్ అప్డేట్ రాకపోవడంతో.. ఆ భయాలు , అనుమానాల నుంచి బయటకు రాలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడిప్పుడే సినిమా నుంచి కాస్త స్పైసి అప్డేట్స్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ దీపావళికి గేమ్ ఛేంజర్ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పటినుంచి.. సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.