iDreamPost
android-app
ios-app

మదరాసి OTT స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

  • Published Sep 26, 2025 | 3:26 PM Updated Updated Sep 26, 2025 | 3:26 PM

శివ కార్తికేయన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమా మదరాసి. అమరన్ తర్వాత ఈ హీరోకు తెలుగులో క్రేజ్ బాగా పెరిగింది. ఇక మదరాసి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే ఊహించిన విధంగా సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.100 వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి రానుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

  • Published Sep 26, 2025 | 3:26 PMUpdated Sep 26, 2025 | 3:26 PM
మదరాసి OTT స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

శివ కార్తికేయన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమా మదరాసి. అమరన్ తర్వాత ఈ హీరోకు తెలుగులో క్రేజ్ బాగా పెరిగింది. ఇక మదరాసి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే ఊహించిన విధంగా సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.100 వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి రానుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది అనే ఓ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఓ ఆరు కంటైనర్స్ ను రాష్ట్రంలోకి తీసుకుని వస్తారు. ఈ మ్యాటర్ ఎన్ఐఏ కు తెలుస్తుంది. అక్కడ ఆఫీసర్ బిజూ మీనన్. అతను తన టీం తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ జరిగిన గొడవలో అతనికి గాయాలు అవుతాయి. ఇక మరోవైపు శివకార్తికేయన్ లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. అనుకోకుండా ఆ ఇద్దరికీ ఒకే ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ ఆ ఆఫీసర్ ప్లాన్ లో ఎంట్రీ ఇస్తాడు . అది ఎలా జరిగింది ? ఆ తర్వాత ఏమైంది ? ఆ క్రిమినల్ ప్లాన్ ను అడ్డుకున్నారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 1 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మదరాసి మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో అసలు మిస్ అవ్వకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.