Aditya N
Lover: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ రచనతో పాటు దర్శకత్వం వహించారు.
Lover: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ రచనతో పాటు దర్శకత్వం వహించారు.
Aditya N
ఇటీవల తమిళంలో వచ్చిన “లవర్” సినిమా ఓటీటీలో విడుదలైంది. కాగా వ్యూయర్ల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ రచనతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా తెలుగు తమిళ సినిమాలకు 4 వారాల ఓటీటీ విండో ఉంటుంది.
కానీ హాట్ స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో లవర్ సినిమా థియేటర్లలో విడుదలైన 7 వారాల తరువాత స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం విశేషం. వాస్తవిక దృక్పథంతో నేటి రోజుల్లో ప్రేమికుల మధ్య ఉండే పరిస్థితులు, సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి థియేటర్లలో కన్నా ఓటీటీలో రెస్పాన్స్ బాగా వస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడి ప్రవర్తన సినిమా చూసిన అందరినీ ప్రభావితం చేసింది. కెరీర్ లో సరిగా సెటిల్ అవక ప్రియురాలిని ఎప్పుడూ అనుమానించే ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరిగాయి. ఈ సినిమా థియేటర్లలో విడుదలయిన రోజే చాలా మంది విమర్శకులు ఇది ఓటీటీ రిలీజ్ కు సరిపోయే సినిమా అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజం అయింది.
కాగా ప్రధాన పాత్రల్లో మణికందన్, గౌరీ ప్రియల అద్భుతమైన నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. నేటి రోజుల్లో యూత్ రిలేషన్షిప్ లో కెరీర్, ఫ్రెండ్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సరిగ్గా చూపించారని నెటిజన్లు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక భాగం మాత్రం ప్రేమించినపుడు అబ్బాయిలకి ఆ మాత్రం పోసేసివ్నెస్ ఉంటుందని, దాన్ని నెగటివ్ గా చూపించడం బాగోలేదని అన్నారు. అయితే చాలా వరకు మాత్రం ఓటీటీ రివ్యూలలో హీరోయిన్ పాత్రకే మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా లవర్ సినిమా థియేటర్లలో కాస్త నిరాశ పరిచినా ఓటీటీ రిలీజ్ లో మాత్రం సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.