iDreamPost
android-app
ios-app

లవ్ మౌళిలో అలాంటి సీన్స్.. యాంకర్ ప్రశ్నకు హీరోయిన్ రియాక్షన్ చూడండి!

  • Published Apr 22, 2024 | 2:39 PM Updated Updated Apr 22, 2024 | 2:39 PM

Love Mouli- Pamkhuri Gidvani: చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మరోసారి హీరోగా కనిపించబోతున్నాడు. అది కూడా లవ్ మౌళి అనే విభిన్న కథ, వైవిధ్య భరిత పాత్రలో రాబోతున్నాడు. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Love Mouli- Pamkhuri Gidvani: చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మరోసారి హీరోగా కనిపించబోతున్నాడు. అది కూడా లవ్ మౌళి అనే విభిన్న కథ, వైవిధ్య భరిత పాత్రలో రాబోతున్నాడు. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

  • Published Apr 22, 2024 | 2:39 PMUpdated Apr 22, 2024 | 2:39 PM
లవ్ మౌళిలో అలాంటి సీన్స్.. యాంకర్ ప్రశ్నకు హీరోయిన్ రియాక్షన్ చూడండి!

టాలీవుడ్ లో ఎన్నో బోల్డ్ చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎన్నో సందేశనాత్మకంగా ఉంటే.. మరికొన్ని ఆలోజింపచేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా నవదీప్ లాంటి విలక్షణ నటుడు లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా అయితే కచ్చితంగా కొత్త ఆలోచన రేకెత్తించే విధంగానే ఉంటుంది. ఎందుకంటే నవదీప్ ఎంచుకునే కథలు విభిన్నంగా ఉండమే కాదు.. ఆడియన్ ఎంటర్ టైన్ చేస్తూనే ప్రశ్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత హీరోగా అలాంటి ఒక భిన్నమైన కథతో నవదీప్ వస్తున్నాడు. ఆ మూవీనే ‘లవ్ మౌళి’. ఈ మూవీలో హీరోయిన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

లవ్ మౌళి చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ చూశాక తెలుగు ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే షాక్ అయ్యారు. ఇంత గ్యాప్ తర్వాత నవదీప్ ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నాడే అని. కానీ, ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత కథలో ఏదో మ్యాజిక్ ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీలో నవదీప్ పూర్తి న్యూ*డ్ గా కూడా నటించాడు అంటున్నారు. అలాగే హీరోయిన్ కూడా టాప్ లెస్, ఇంటిమేట్, లి*ప్ లాక్ సీన్స్ ఉన్నాయనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ ఏప్రిల్ 19నే విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది.

ఇప్పుడు మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా తేజశ్వి మదివాడ చేసిన ఇంటర్వ్యూలో హీరోయిన్ పంఖురి గిద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తేజశ్వీ ఈ మూవీలో ఉన్న సీన్స్ గురించి అడగ్గానే.. హీరోయిన్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయన్ అలా చేయగానే తేజశ్వీ కూడా షాకయ్యింది. అలాగే ఫక్కున నవ్వేసింది. మూవీలో అలాంటి సీన్స్ చేసినప్పుడు కాస్త సిగ్గుగా అనిపించిందని పంఖురి గిద్వానీ చెప్పుకొచ్చింది. తేజశ్వి కూడా తాను నటించిన ఇంటిమేట్ సీన్స్ గురించి హీరోయిన్ తో పంచుకుంది. అలాంటి సీన్స్ లో నటించాలంటే గట్స్ కావాలంటూ చెప్పుకొచ్చింది.

ఇంక మూవీ మాత్రం బిగ్గెస్ట్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆడియన్స్ నుంచి కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగులో బిగ్గెస్ట్ ట్రైలర్ ని వీళ్లు రిలీజ్ చేశారు. ఏకంగా 4 నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఒక గొప్ప ఆర్టిస్ట్ కథ ఇది. మనుషులుకు దూరంగా తన లోకంలో తాను బతుకుతున్న వ్యక్తికి ప్రేమ దొరికితే అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనే కోణంలో ఈ మూవీని చూపించారు. దాదాపుగా కథ మొత్తాన్ని, నవదీప్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు. మరి.. హీరోయిన్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet