Swetha
ప్రస్తుతం లోకేష్ కనకగరాజ్ తన టీం తో సహా కూలి ప్రమోషన్స్ లో బిజీ బిజిగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ చేసే క్రమంలో కొందరు కేవలం ప్రస్తుతం సినిమా గురించే కాకుండా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఈ ప్రాసెస్ లో లోకేష్ కు కూడా ఓ వింత ప్రశ్న ఎదురైంది.
ప్రస్తుతం లోకేష్ కనకగరాజ్ తన టీం తో సహా కూలి ప్రమోషన్స్ లో బిజీ బిజిగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ చేసే క్రమంలో కొందరు కేవలం ప్రస్తుతం సినిమా గురించే కాకుండా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఈ ప్రాసెస్ లో లోకేష్ కు కూడా ఓ వింత ప్రశ్న ఎదురైంది.
Swetha
ప్రస్తుతం లోకేష్ కనకగరాజ్ తన టీం తో సహా కూలి ప్రమోషన్స్ లో బిజీ బిజిగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ చేసే క్రమంలో కొందరు కేవలం ప్రస్తుతం సినిమా గురించే కాకుండా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఈ ప్రాసెస్ లో లోకేష్ కు కూడా ఓ వింత ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు రజినికాంత్ , నాగార్జున , కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోస్ ను హ్యాండిల్ చేసి ఇప్పుడు ఖైదీ 2 కోసం కార్తీ లాంటి టయర్ 2 హీరోస్ ను హ్యాండిల్ చేయడంపై మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. దానికి లోకేష్ అందరిని సైలెంట్ చేసే ఆన్సర్ ఇచ్చాడు. తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయంలో ఖైదీ రూపంలో తనతో ఉన్నది కార్తీనే అని.. ఆయన తనకు పెద్ద స్టార్ అని.. ఇప్పుడు ఖైదీ 2 తో అదిరిపోయే హిట్ ఇస్తానని సింపుల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.
ఖైదీ 2 విషయానికొస్తే.. లోకేష్ ఇప్పటికి దానికి సంబంధించి కొంత స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. కూలి సినిమా రిలీజ్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకుని వెంటనే ఖైదీ సిక్వెల్ ఫైనల్ వెర్షన్ పనులు స్టార్ట్ చేస్తాడట లోకేష్. ప్రస్తుతం కార్తీ కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం ఒకటి రెండు సంవత్సరాలు పడుతుంది. సో ఇద్దరు ఫ్రీ అయ్యాక ఖైదీ 2 పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఖైదీ 2 కథ విషయానికొస్తే.. జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ఏమి చేసాడు? అతనికి విక్రమ్ , రోలెక్స్ కు సంబంధం ఏంటి ? అక్కడ నుంచి కథ ఎలా ముందుకు సాగుతుంది లాంటివాటిని లోకేష్ తన యూనివర్స్ లో చూపించనున్నాడు.
కార్తీ యాక్టింగ్ కు ఫ్యాన్ బేస్ అయితే ఉన్నారులే కానీ.. గత కొంత కాలంగా కార్తీ ఖాతాలో సరైన హిట్ అయితే పడలేదు. సో ఇప్పుడు ఖైదీ 2 రూపంలో కార్తీ హిట్ కొట్టేయడం ఖాయం. అందులోను లోకేష్ తీరు చూస్తుంటే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. కూలీ సినిమా రిలీజ్ పనులు.. రిలీజ్ తర్వాత రిజల్ట్స్ , బాక్స్ ఆఫీస్ లెక్కలు ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే కానీ లోకేష్ ఫ్రీ అవ్వడు. ఇక ఆ తరువాత ఖైదీ 2 అప్డేట్స్ రావొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.