iDreamPost
android-app
ios-app

లియో ప్రమోషన్‌లో అపశృతి.. లోకేష్‌కు ప్రమాదం!

  • Published Oct 24, 2023 | 6:08 PM Updated Updated Oct 24, 2023 | 6:08 PM

ఇంతకీ ఏం జరిగిందంటే.. లోకేష్‌ తాజాగా, కేరళలోని అరోమా థియేటర్‌ దగ్గరకు వెళ్లారు. లోకేష్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను కల్పించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. లోకేష్‌ తాజాగా, కేరళలోని అరోమా థియేటర్‌ దగ్గరకు వెళ్లారు. లోకేష్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను కల్పించారు.

  • Published Oct 24, 2023 | 6:08 PMUpdated Oct 24, 2023 | 6:08 PM
లియో ప్రమోషన్‌లో అపశృతి.. లోకేష్‌కు ప్రమాదం!

లియో సాధించిన విజయంతో ఫుల్‌ ఖుషీలో ఉన్నారు దర్శకుడు ‘లోకేష్‌ కనగరాజ్‌’. తమిళనాడు, కేరళలో సినిమా సూపర్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలై దాదాపు ఐదు రోజులు అవుతున్నా థియేటర్ల దగ్గర సందడి మాత్రం తగ్గడం లేదు. లోకేష్‌ ‍ప్రస్తుతం లియో ప్రమోషన్‌ కోసం కేరళ వెళ్లారు. రాష్ట్రంలోని పలు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సినిమా థియేటర్‌ దగ్గర అపశృతి చోటుచేసుకుంది. లోకేష్‌ ప్రమాదానికి గురయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. లోకేష్‌ తాజాగా, కేరళలోని అరోమా థియేటర్‌ దగ్గరకు వెళ్లారు. లోకేష్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. అయినప్పటికి అభిమానులు లోకేష్‌ మీదకు దూసుకువచ్చారు. దీంతో ఆయన గాయపడ్డారు. పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి మరీ, అందర్నీ చెదరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గాయం కారణంగా తిస్సూర్‌ రాగం, కొచ్చి కవిత థియేటర్లకు వెళ్లాల్సిన ఆయన తిరిగి చెన్నై వెళ్లిపోయారు. ప్రెస్‌ మీట్‌ కూడా క్యాన్సిల్‌ చేశారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ఆ పోస్టులో.. ‘‘కేరళ అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. పాలక్కడ్‌లో మిమ్మల్ని చూసినందుకు ఎంతో సంతోషంగా.. గర్వంగా ఉంది. అక్కడ జనం కారణంగా చిన్న గాయం అయింది. దాని కారణంగా మరో రెండు చోట్లకు వెళ్లలేకపోయాను. ప్రెస్‌ మీట్‌ కూడా క్యాన్సిల్‌ చేశాను. నేను మళ్లీ కేరళ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు అంతే ప్రేమతో లియోను ఆనందించండి’’ అని పేర్కొన్నారు. మరి, కేరళ ప్రమోషన్‌లో ఫ్యాన్స్‌ కారణంగా లోకేష్‌ కనగరాజ్‌ గాయడపడ్డంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Lokesh Kanagaraj (@lokesh.kanagaraj)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet