Swetha
ఈ వారం మినిమమ్ గ్యారెంటీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనుష్క నుంచి మాస్ మసాలా మూవీ ఎవరు ఊహించి ఉండరు. పైగా ఈ అమ్మడినుంచి సినిమాలు వచ్చి చాలా కాలం కావడం.. అందులోను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేర్ ఆఫ్ అడ్రెస్స్ కావడంతో.. ఈ వారం రేస్ లో మొదట వినిపించే పేరుగా మారింది ఘాటీ
ఈ వారం మినిమమ్ గ్యారెంటీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనుష్క నుంచి మాస్ మసాలా మూవీ ఎవరు ఊహించి ఉండరు. పైగా ఈ అమ్మడినుంచి సినిమాలు వచ్చి చాలా కాలం కావడం.. అందులోను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేర్ ఆఫ్ అడ్రెస్స్ కావడంతో.. ఈ వారం రేస్ లో మొదట వినిపించే పేరుగా మారింది ఘాటీ
Swetha
ఈ వారం మినిమమ్ గ్యారెంటీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనుష్క నుంచి మాస్ మసాలా మూవీ ఎవరు ఊహించి ఉండరు. పైగా ఈ అమ్మడినుంచి సినిమాలు వచ్చి చాలా కాలం కావడం.. అందులోను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేర్ ఆఫ్ అడ్రెస్స్ కావడంతో.. ఈ వారం రేస్ లో మొదట వినిపించే పేరుగా మారింది ఘాటీ. ఇక ఆ తర్వాత శివ కార్తికేయన్ మదరాసి మూవీ పేరు వినిపించింది. స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదులే కానీ అమరన్ తర్వాత ఈ హీరో సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ పెరిగింది.
సో ఈ రెండు కుందేళ్లు పరుగు పందెం స్టార్ట్ చేసాయి. రేస్ లో నేను కూడా ఉన్నానంటూ నేను కూడా ఈ వారమే పార్టిసిపేట్ చేస్తానంటూ ఎంట్రీ ఇచ్చింది లిటిల్ హార్ట్స్. సినిమాలో పెద్దగా స్టార్ క్యాస్టింగ్ లేరు.. చెప్పుకోదగిన దర్శకుడు కాదు.. కథ కూడా ఎదో పిల్లల ఆటలా ఉంది. ఇది పోటీలో పార్టిసిపేట్ చేసిన ఉపయోగం ఏముందిలే.. తాబేలులా మెల్లిగా నడుస్తుంది కుందేళ్లను బీట్ చేయలేదు అనుకున్నారు అంతా. అలాగే మూడు రేస్ లో పార్టిసిపేట్ చేశాయి. కట్ చేస్తే తాబేలు కుందేలు కథలోలానే అయింది ఈ వారం బాక్స్ ఆఫీస్ సినిమాల పరిస్థితి. మంచి క్రేజ్, స్టార్ అట్రాక్షన్ ఉన్న ఘాటీ , మదరాసి సినిమాలను దాటుకుని హిట్ టాక్ సంపాదించుకుంటుంది లిటిల్ హార్ట్స్.
ఈ సినిమాకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఘాటీ, మదరాసి సినిమాలు పాజిటివ్ టాక్‌లో లిటిల్ హార్ట్స్ కంటే వెనకబడ్డాయి. ప్రేక్షకుల మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న సిట్యువేషన్ లో ఇలా మనసారా నవ్వుకునే లైటర్ వెయిన్ సినిమాలనో ఆస్వాదించడం . లేకపోతే మనసుకు హాయి కలిగించే మహావతార్ నరసింహ లాంటి సినిమాలను ఆరాధించడం చేస్తున్నారు. పైగా ఇలాంటి చిన్న సినిమాలకు ఎలాంటి అంచనాలు లేకపోవడం వాటికే ప్లస్ పాయింట్ అవుతుంది.
లిటిల్ హార్ట్స్ ఏమి కొత్త కథ కాదు.. కథలో ముందుకు వెళ్లేకొద్దీ కొత్తగా చూపిస్తారన్న నమ్మకము ఎవరికీ లేదు. అయినాసరే జనాలు థియేటర్స్ కు కదులుతున్నారు. దానికి ఏకైక కారణం కాసేపు హాయిగా కూర్చుని నవ్వుకోడానికి. సినిమా నుంచి ఏమి ఆశించకుండా వెళ్ళినప్పుడు ఓ మామూలు సీన్ కూడా థౌసండ్ వాలాలా పేలుతుంది. లిటిల్ట్ హార్ట్స్ విషయంలో అదే జరిగింది. ఓ సినిమా పోజిటివ్ టాక్ తెచ్చుకోవాలంటే భారీ క్యాస్టింగ్ తో పనిలేదని.. ఎదో ఒక క్యాచింగ్ పాయింట్ ఉంటె సరిపోతుందని మరోసారి మరో చిన్న సినిమా ప్రూవ్ చేసింది. కమర్షియల్ గా ఏ సినిమా ముందుందో ఇంకో మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.