Swetha
సెప్టెంబర్ 5 రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలో లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ లేరు..పాపులర్ డైరెక్టర్ , యాక్టర్స్ కూడా ఎవరు లేరు. అయినా సరే ఈ సినిమాకు మాత్రం కాస్తో కూస్తో బజ్ బాగానే ఉంది. దానికి కారణం స్టోరీ అంతా ఇప్పటి వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉండడమే.
సెప్టెంబర్ 5 రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలో లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ లేరు..పాపులర్ డైరెక్టర్ , యాక్టర్స్ కూడా ఎవరు లేరు. అయినా సరే ఈ సినిమాకు మాత్రం కాస్తో కూస్తో బజ్ బాగానే ఉంది. దానికి కారణం స్టోరీ అంతా ఇప్పటి వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉండడమే.
Swetha
సెప్టెంబర్ 5 రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలో లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ లేరు..పాపులర్ డైరెక్టర్ , యాక్టర్స్ కూడా ఎవరు లేరు. అయినా సరే ఈ సినిమాకు మాత్రం కాస్తో కూస్తో బజ్ బాగానే ఉంది. దానికి కారణం స్టోరీ అంతా ఇప్పటి వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉండడమే. యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఎంత ఫ్రెష్ స్టోరీ అయినా సరే రేస్ లో ఈ సినిమాతో పాటు అనుష్క ఘాటీ , శివ కార్తికేయన్ మదరాసి సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాంపిటీషన్ తట్టుకోవాల్సిందే.
అందుకే ఇప్పుడు ఈ రేస్ లో విన్ అవ్వడం కోసం లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. యూత్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న సినిమా కాబట్టి.. సెప్టెంబర్ 3 న హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడలో సాయంత్రం కాలేజీ స్టూడెంట్స్ కి ఫ్రీ షోలు వేస్తున్నారట. ఇందులో ఏముంది అనుకుంటే పొరపాటే. పైగా ఇలా ఫ్రీ షో ల వలన నష్టం ఉంటుంది అనుకున్న పొరపాటే. ఎందుకంటే ఒకవేళ టాక్ బావుంటే ఇదే ప్లస్ పాయింట్ అవుతుంది. పైగా సోషల్ మీడియాలో వద్దన్నా సరే ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది.
సరిగ్గా రిలీజ్ కు రెండు రోజుల ముందు ఇలా చేయడం వలన లిటిల్ హార్ట్స్ కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. నిజానికి ఇది ఈటీవీ విన్ తీసిన సినిమా. కానీ ఔట్పుట్ చూసిన తర్వాత థియేటర్ లో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారనిపించి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. గతంలో సుమంత్ అనగనగ విషయంలో జరిగిన మిస్టేక్ ఇక్కడ లేకుండా చూసుకుంటున్నారు. 90స్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ లిటిల్ హార్ట్స్ మెయిన్ ప్రొడ్యూసర్. సో చాలా కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకుని వస్తున్నారు. ఇక దీనికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.