iDreamPost
android-app
ios-app

15 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లి.. స్టార్ హీరోయిన్ కన్నీటి కథ!

  • Published Nov 09, 2023 | 4:25 PM Updated Updated Nov 09, 2023 | 4:25 PM

సినీ ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత సామాన్య విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ ని ఎదిరించిన వారికి ఇండస్ట్రీలో ఛాన్సులు లేకుండా చేస్తారని టాక్ ఉంది.

సినీ ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత సామాన్య విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ ని ఎదిరించిన వారికి ఇండస్ట్రీలో ఛాన్సులు లేకుండా చేస్తారని టాక్ ఉంది.

15 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లి.. స్టార్ హీరోయిన్ కన్నీటి కథ!

ఒక మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టసుఖాలు, జయాపజయాలు ఉంటాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఇవి అనుభవించి తీరాల్సిందే. సినీ ఇండస్ట్రీలో రాణించాలని ఎంతో మంది ఆశపడుతుంటారు.. ఇందుకోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. ఎంతోమంది చేతిలో దారుణంగా మోసపోతుంటారు.ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే.. సెలబ్రెటీ హూదా వస్తుందన్న ఆశ.. అందుకే ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. సినిమాల్లో చాన్సు వచ్చినా.. సరైన సక్సెస్ లేక ఎంతో మది నటీనటులు వెండితెరకు దూరమయ్యారు. నేటి హీరోయిన్ల మాదిరి సక్సెస్ అంటే ఏమిటో తెలియని వయసు, చదువుకునే వయసులోనే తల్లి అయ్యింది. కానీ అదృష్టం ఆమె జీవితాన్ని మరోవైపు నడిపించింది.. పదేళ్ళ పాటు హిందీ, బెంగాలీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయింది.. ఇంతకీ ఆ నటి ఎవరు? అర్థాంతరంగా ఆమె కెరీర్ ఎలా ముగిసింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలో ఒకప్పుడు బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి. బాల్య వివాహాలు చట్టప్రకారం నేరం అని తెలిసినా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు సామాజిక కార్యకర్తలు, నేతలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అరికట్టేలేకపోతున్నారు. 1967 లో బాల్య వివాహ వ్యవస్థను ఎండగడుతూ.. ‘బాలికా బధు’ అనే బెంగాలీ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని ఏకంగా 75 వారాలకు పైగా థియేటర్లో నడిచి ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఈ మూవీలో నటించిన మెయిన్ క్యారెక్టర్ చిన్నారి బాలిక పేరు ఇందిర. మూవీలో ఆ చిన్నారి పేరు మౌసమి. సినిమా సూపర్ హిట్ కావడంతో అదే పేరు స్థిరపడిపోయింది. అప్పటికి మౌసమి వయసు 10 సంవత్సరాలు. తర్వాత ఎన్నో సినిమా ఛాన్సులు వచ్చినప్పటికీ చదువుకోవాలని వాటన్నింటిని రిజక్ట్ చేసింది.

మౌసమి పదో తరగతి చదివే సమయంలో ఆమె అక్క క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉంది.. దీంతో తను మౌసమి పెళ్లి చూడాలని పట్టుపట్టింది.  ఆమె కోసం మౌసమి తన పదవ తరగతి పరీక్షలు త్యాగం చేయాల్సి వచ్చింది. బాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ హేమంత్ రావు కుమారుడు, నటుడు అయిన జయంత్ ముఖర్జీతో మౌసమికి పెళ్లయ్యింది. అలా 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తల్లి అయ్యింది. అయితే అత్తింటి వారి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1972లో వచ్చిన ‘అనురాగ్’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలనాటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీ, బెంగాలీ ఇండస్ట్రీలో పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. అయితే మౌసమి కి కూడా క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఆమె వాటిని తిరస్కరించడంతో చాలా సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందట, అంతేకాదు తన యాటిట్యూట్ వల్ల చాలా సినిమాల నుంచి తీసివేయడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు. 2015వచ్చిన పీకూఆమె చివరి చిత్రం.