Venkateswarlu
విగ్నేష్ శివన్ 2022లో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాల్ని అందుకోలేకపోయింది.
విగ్నేష్ శివన్ 2022లో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాల్ని అందుకోలేకపోయింది.
Venkateswarlu
‘నానుమ్ రౌడీదా’ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విగ్నేష్ శివన్. ఈ మూవీ తెలుగులో ‘ నేనూ రౌడీనే..’’గా డబ్ అయింది. ఇక్కడ కూడా హిట్ అయింది. 2022లో ఆయన ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ తర్వాత విగ్నేష్ కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు.
నెల క్రితం కొత్త సినిమాను ప్రకటించారు. లవ్‌టుడే హీరో ప్రదీప్ రంగనాథన్‌తో ‘ఎల్‌ఐసీ’ మూవీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరావేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ప్రదీప్ సరసన.. కృతీ శెట్టి నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ సినిమా టైటిల్ దర్శకుడు విగ్నేష్‌ను చిక్కుల్లో పడేసింది. లవ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ పేరును షార్ట్ కట్‌లో ఎల్‌ఐసీగా పెట్టుకున్నారు విగ్నేష్. ఎల్‌ఐసీ పేరును వాడటంపై ‘ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్’ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు విగ్నేష్ శివన్‌కు నోటీసులు పంపింది. ఆ పేరును వాడు కోవటం వల్ల లీగల్ సమస్యలు తప్పవని హెచ్చరించింది. ఆ పేరును వాడటం కాపీ రైట్ హక్కుల కిందకు వస్తుందని తెలిపింది. ఏడు రోజుల్లోగా సినిమా టైటిల్‌లో మార్పులు చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే, ఎల్‌ఐసీ నోటీసులపై విగ్నేష్ శివన్ కానీ, చిత్ర బృందం కానీ, ఇప్పటి వరకు స్పందించలేదు. విగ్నేష్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
కాగా, విగ్నేష్ శివన్ 2007లో వచ్చిన సివి అనే తమిళ చిత్రంతో నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2012లో వచ్చిన ‘పోడా పోడీ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. 2015 వేలయిల్లాదా పట్టదారి సినిమాలో ఓ పాత్ర చేశారు. 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీదా’ సినిమా సమయంలో విగ్నేష్‌కు, నయన్‌కు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లు.. 2022 జూన్, 9వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మరి, కొత్త సినిమా టైటిల్ కారణంగా దర్శకుడు విగ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.