Swetha
కంటెంట్ బావుంటే ఏ భాష సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలానే మూడేళ్ల క్రిందట కన్నడ నుంచి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు వచ్చిన సినిమా కాంతార. కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. అక్కడ గుడ్ టాక్ తెచ్చుకుని ఇతర భాషల వాళ్లలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీనితో తెలుగు , హిందీ , తమిళంలో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.

కంటెంట్ బావుంటే ఏ భాష సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలానే మూడేళ్ల క్రిందట కన్నడ నుంచి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు వచ్చిన సినిమా కాంతార. కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. అక్కడ గుడ్ టాక్ తెచ్చుకుని ఇతర భాషల వాళ్లలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీనితో తెలుగు , హిందీ , తమిళంలో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.400 కోట్లు కలెక్ట్ చేసి సంచనలం క్రియేట్ చేసింది.
దీనితో సిక్వెల్ కాంతార: చాప్టర్ 1 మీద హైప్ క్రియేట్ అయింది. పైగా బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు భారీ బడ్జెట్ పెట్టి సినిమాను తీశారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవ్వలేదు. అయినా సరే హైప్ విషయంలో ఎక్కడ డోకా లేదు. కానీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు మొదటి పార్ట్ లా ఈ సినిమాలో ఏమైనా సర్ప్రైజ్ లు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోనీ ఇటు సినిమాకు బుకింగ్స్ అయినా గట్టిగా జరుగుతున్నాయా అంటే.. అది కూడా డల్ గానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ మొదలుకాలేదు. ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే సినిమా మీద ఉన్న హైప్ కంటే.. సినిమా విషయంలో కాస్త నెగిటివిటి కూడా నడుస్తుంది. సినిమా టాక్ ను బట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా మొదట పార్ట్ కి ఉన్నంత హైప్ దీనికి లేదనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.