దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ LCUలో భాగంగా ఇటీవల 'లియో' మూవీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. విజయ్ కెరీర్ లో పాన్ ఇండియా స్థాయికో విడుదలైన ఫస్ట్ మూవీగా లియో నమోదు అయ్యింది.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ LCUలో భాగంగా ఇటీవల 'లియో' మూవీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. విజయ్ కెరీర్ లో పాన్ ఇండియా స్థాయికో విడుదలైన ఫస్ట్ మూవీగా లియో నమోదు అయ్యింది.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ LCUలో భాగంగా ఇటీవల ‘లియో’ మూవీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. విజయ్ కెరీర్ లో పాన్ ఇండియా స్థాయికో విడుదలైన ఫస్ట్ మూవీగా లియో నమోదు అయ్యింది. ఈ సినిమాని మాస్టర్ ఫేమ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించాడు. ఇక సినిమా ముందునుండి LCUలో భాగమే అంటూ ప్రచారం జరిగినా.. లోకేష్ ఎక్కడ కూడా క్లూ వదలలేదు. పైగా ట్రైలర్ లో కూడా ఎలాంటి హింట్ ఇవ్వలేదు.. సో.. సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ బజ్ క్రియేట్ అయిపోయింది.
కట్ చేస్తే.. లియో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు స్థాయిలో రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు ఏకంగా వరల్డ్ వైడ్ రూ. 140 కోట్లకు పైగా వసూల్ చేసిందని లెక్కలు ప్రకటించారు. ఫస్ట్ డే లెక్కలు బట్టి.. సినిమా రెండు మూడు రోజులు కూడా సాలిడ్ నెంబర్స్ వసూల్ చేసిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే.. లియో యూఎస్ వసూళ్ల లెక్కల్లో తప్పులు ఉన్నాయని.. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్ని క్రియేట్ చేసినవే అని స్వయంగా కోలీవుడ్ వర్గాలు విమర్శలు కురిపించాయి. మరి లియో లెక్కల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో రూ. 500 కోట్ల గ్రాస్ అందుకుందని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. లియో మూవీ చాలా వరకు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని ఏరియాలు మినహాయించి దాదాపుగా కవర్ చేసి.. లాభాల బాట పట్టినట్లు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో లియో బ్రేక్ ఈవెన్ దాటి లాభాలలో పరుగులు పెడుతోందని సమాచారం. సుమారు రూ. 40 కోట్లకు పైగా గ్రాస్.. రూ. 20 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అంటే.. డబ్బింగ్ సినిమాలలో లియో కూడా హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులోకెక్కనుంది. అయితే.. తెలుగు రాష్ట్రాలలో రికార్డులు క్రియేట్ చేస్తున్న లియో.. తమిళ, యూఎస్ వెర్షన్స్ లో కలెక్షన్స్ పరంగా విమర్శలు ఫేస్ చేస్తోంది. ఇక లియో అసలు లెక్కలేంటి? అనేది మేకర్స్ తేల్చాల్సి ఉంది. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
ఇదీ చదవండి: సరిపోదా శనివారం.. టైటిల్ ఇన్స్పిరేషన్ ఆ మూవీనా?