స్ట్రెయిట్ మూవీస్ కంటే డబ్బింగ్ మూవీ టికెట్ రేట్స్ ఎక్కువనా..?

  • Author ajaykrishna Published - 03:00 PM, Fri - 13 October 23
  • Author ajaykrishna Published - 03:00 PM, Fri - 13 October 23
స్ట్రెయిట్ మూవీస్ కంటే డబ్బింగ్ మూవీ టికెట్ రేట్స్ ఎక్కువనా..?

ఇండస్ట్రీలో పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. థియేటర్స్ వద్ద కొత్త సినిమాల హడావిడి మొదలైపోతుంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు హాలిడేస్.. ఈ రెండు కలిసి ప్రేక్షకులు పండుగ మూమెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఫెస్టివల్ సీజన్ అనేది చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు జనాలు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎక్కడలేని హుషారు కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ రాబోతుంది. ఇప్పటికే పండుగకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా.. ఇండస్ట్రీలో కూడా ఫెస్టివల్ రిలీజ్ కి పెద్ద సినిమాలు సిద్ధం అవుతున్నాయి.

దసరాకి రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. అవేంటో మీకు ఆల్రెడీ తెలుసు. మాస్ రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఒకటి. రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా ఇది. రెండోది భగవంత్ కేసరి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు సాంగ్స్, ట్రైలర్స్ తో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. కాగా.. ఈ రెండు కూడా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాగా.. వీటికి తోడు తమిళ డబ్బింగ్ మూవీ కూడా వస్తోంది.

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో.. అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై వరల్డ్ వైడ్ ఫుల్ హైప్ నెలకొంది. అందుకు కారణం లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన LCU. అయితే.. తెలుగు రాష్ట్రాలలో దసరాకు టికెట్ రేట్స్ విషయంలో.. స్ట్రెయిట్ మూవీస్ కంటే డబ్బింగ్ మూవీకే ఎక్కువ డిమాండ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. భగవంత్ కేసరికి మల్టీప్లెక్స్​ లో రూ. 250, సింగిల్ స్క్రీన్​ లో రూ.175 కాగా.. టైగర్ కు మల్టీప్లెక్స్​ లో రూ. 200, సింగిల్ స్క్రీన్​ రూ.150గా ఉందని.. అలాగే ఈ రెండింటిని మించి డబ్బింగ్ సినిమా అయినా లియోకి మల్టీప్లెక్స్​ లో రూ. 295, సింగిల్ స్క్రీన్​ రూ.175గా ఉందంటూ కథనాలు బయటికి రావడం చర్చనీయంశంగా మారింది. డబ్బింగ్ సినిమాకు ఒరిజినల్ లాంగ్వేజెస్ కంటే ఎక్కువ డిమాండ్ ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు జనాలు. ప్రస్తుతం ఇది ప్రచారంలో ఉన్న వార్త మాత్రమే.. అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో.. లియోకి తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి..

Show comments