‘లియో’ హైప్ కి కారణం.. విజయ్ కాదా?

  • Author ajaykrishna Published - 03:53 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Published - 03:53 PM, Thu - 5 October 23
‘లియో’ హైప్ కి కారణం.. విజయ్ కాదా?

ప్రస్తుతం కోలీవుడ్ తో సహా పాన్ ఇండియా వైడ్ వెయిట్ చేస్తున్న సౌత్ సినిమాలలో ‘లియో’ ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓవైపు ఫ్యాన్స్ అంచనాలు.. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్.. అనిరుధ్ సాంగ్స్.. లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ అన్ని కలిపి లియోపై అంచనాలు తారాస్థాయిలో సెట్ చేశాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ మూవీలో.. త్రిష హీరోయిన్ కాగా, సంజయ్ దత్, అర్జున్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రెజెంట్ ప్రమోషన్స్ మొదలుపెట్టి.. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా.. దసరా సందర్బంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషలలో లియో రిలీజ్ అవుతోంది.

కట్ చేస్తే.. సినిమా ట్రైలర్ అక్టోబర్ 5న రానుందని ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పటినుండి ఫ్యాన్స్ లో అంచనాలు.. ఇంటరెస్ట్ హైప్ అన్ని పీక్స్ కి చేరుకున్నాయి. విజయ్ ని లియో లుక్ లో చూసి ఆల్రెడీ ఇంప్రెస్స్ అయిన ఫ్యాన్స్.. ఇప్పుడు ట్రైలర్ చూస్తేగానీ సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ రాదు. సో.. ఒక రకంగా లియో సినిమా కంటే.. ప్రస్తుతం ట్రైలర్ పైనే ఆసక్తి ఎక్కువగా నెలకొందని చెప్పవచ్చు. మరి లియోపై ఇంతటి హైప్, క్రేజ్ కి కారణం ఏంటి? అనంటే.. చాలా కారణాలు ఉండొచ్చు. సాధారణంగా ఓ సినిమా వస్తుందంటే.. ఖచ్చితంగా హీరో క్రేజ్ అనేది సినిమా హైప్ లో కాస్తో కూస్తో భాగం అవుతుంది. కొన్నిసార్లు హీరో క్రేజ్ మాత్రమే సినిమాలను నడిపిస్తాయి.

అలాంటిది లియో విషయంలో మాత్రం హీరో దళపతి విజయ్ ఒక్కడినే మెన్షన్ చేయడం కరెక్ట్ కాదని టాక్ ఉంది. ఎందుకంటే.. లియో హైప్ కి అసలు కారణం.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అవును.. విజయ్ క్రేజ్ ఎంత ఉన్నా.. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ అని, లోకి సినిమాటిక్ యూనివర్స్ లో లియో భాగం కాబోతుందని తెలిసి ఫ్యాన్స్ హైప్ డబుల్ అయిపోయింది. ఓ విధంగా లియోకి మేజర్ ప్లస్ లోకేష్ అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జస్ట్ లోకేష్ విజయ్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథలు రాయడు. తాను రాసుకున్న కథకు విజయ్ క్రేజ్ తోడైంది అనేది మరో టాక్. ప్రస్తుతం లియో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సో.. ట్రైలర్ క్రేజ్ కి మాత్రం లోకేషే కారణం అని కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు. ఎందుకంటే.. విజయ్ ని ఎలా చూపించాడు అనేది పక్కన పెడితే.. అసలు ఖైదీ, విక్రమ్ లకు లియో స్టోరీ ఎలా లింక్ చేశాడు? అనేది అసలు ఇంటరెస్టింగ్ పాయింట్. సో.. క్రెడిట్ ఎలాగైనా లోకేష్ కి వెళ్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments