iDreamPost
android-app
ios-app

Louis Gossett Jr: సినీ ఇండస్ట్రీలో విషాదం..ఆస్కార్ విజేత కన్నుమూత!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్యం వంటి వివిధ కారణాలతో సెలబ్రిటీలు కన్ను మూస్తున్నారు. తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ మృతి చెందారు.

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్యం వంటి వివిధ కారణాలతో సెలబ్రిటీలు కన్ను మూస్తున్నారు. తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ మృతి చెందారు.

Louis Gossett Jr: సినీ ఇండస్ట్రీలో విషాదం..ఆస్కార్ విజేత కన్నుమూత!

మరణం అనేది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. మృత్యువు ముందు ఎంతటి వారైనా  తలవంచాల్సిందే. అందుకే ఎంతో మంది ధనవంతులు కూడా మరణం నుంచి తప్పించుకోలేక మృత్యు ఒడికి చేరుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ కమెడియన్ మరణించాడు. నిన్న ప్రముఖ నటుడు డేనియల్ బాలజీ కన్నుమూశారు. తాజాగా మరో విషాధం చోటుచేసుకుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ కన్నుమూశారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పూర్తి వివారల్లోకి వెళ్తే…

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికలన్ నటుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ లూయిస్ గోసెట్ జూనియర్(87) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోలూయిస్ తుది శ్వాస విడిచారు. లూయిస్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక లూయిస్ గురించి మనం చూసినట్లు అయితే 1936లో లూయిస్ గోసెట్ సీనియర్, హెలెన్ రెబక్కా దంపతులకు మే 27న న్యూయార్క్ లో లూయిస్ గోసెట్ జూనియర్ జన్మించారు. చిన్నతనం నుంచి లూయిస్ కి నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. తాను ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరుకున్నారు. అలానే 17 ఏళ్ల వయసులోనే రంగస్థల నటుడిగా మారారు. అక్కడ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాందించారు.  ఆ తరువాత  సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చారు.

 అనేక  సినిమాల్లో నటించి.. తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. అలానే తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు. ‘ఎ రైసిన్‌ ఇన్‌ ది సన్, ది బ్లాక్స్, ది పనిషర్, స్కిన్‌గేమ్‌’ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. ‘ది బుక్‌ ఆఫ్‌ నీగ్రోస్‌’ వంటి టెలివిజన్‌ సిరీస్‌లలో కూడా లూయిస్ జూనియర్ నటించారు. ఇక సినిమా వాళ్లు ఉండే కోరిక ఆస్కార్ అవార్డు గెల్చుకోవాడం. ఆ కలను లూయిస్ జూనియర్ సాకారం చేసుకున్నారు. 1982లో వచ్చిన ‘యాన్‌ ఆఫీసర్‌ అండ్‌ ఏ జెంటిల్‌మేన్‌’ కు లూయిస్ అవార్డు అందుకున్నారు. 55వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో లూయిస్‌ ఉత్తమ సహాయనటుడు విభాగంలో అవార్డు గెలిచారు.

ఈ అవార్డు అందుకోవడంతో లూయిస్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.  ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి నటుడు లూయిస్‌నే అని హాలీవుడ్‌ సమాచారం. అలాగే ‘యాన్‌ ఆఫీసర్‌ అండ్‌ ఏ జెంటిల్‌మేన్‌’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా గెల్చుకున్నారు. 1977లో వచ్చిన మినీ సిరీస్‌ ‘రూట్స్‌’లోని నటన లూయిస్‌కి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాక ఈ సిరీస్ ఎమ్మీ అవార్డు కూడా అందుకునేలా చేసింది. ఇక లూయిస్ మరణంతో హాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.  పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.