iDreamPost
android-app
ios-app

లారెన్స్ గొప్ప మనసు.. ఈసారి మహిళా ఆటో డ్రైవర్ల కోసం..

  • Published May 06, 2024 | 11:23 AM Updated Updated May 06, 2024 | 11:23 AM

Raghava Lawrence: కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోగా మంచి పేరు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో లారెన్స్ రాఘవ ఒకరు. ఇప్పటి వరకు ఎంతోమంది పేద ప్రజలకు సామమందించారు. చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో గొప్ప సాయం చేసి వార్తలో నిలిచారు.

Raghava Lawrence: కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోగా మంచి పేరు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో లారెన్స్ రాఘవ ఒకరు. ఇప్పటి వరకు ఎంతోమంది పేద ప్రజలకు సామమందించారు. చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో గొప్ప సాయం చేసి వార్తలో నిలిచారు.

  • Published May 06, 2024 | 11:23 AMUpdated May 06, 2024 | 11:23 AM
లారెన్స్ గొప్ప మనసు.. ఈసారి మహిళా ఆటో డ్రైవర్ల కోసం..

సినీ ఇండస్ట్రీలోకి డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోలతో పనిచేశారు. కొరియోగ్రఫి చేస్తూనే నటుడిగా తన సత్తా చాటాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తూ వరుస విజయాలు అందుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గత ఏడాది రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. కాకపోతే ఈ మూడు చిత్రాలు పెద్దగా ప్రేక్షకాధరణ పొందలేకపోయాయి. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో లారెన్స్ హీరో అంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా మరోసారి లారెన్స్ తన గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

లారెన్స్ రాఘవ వెండితెరపైనే కాదు.. బయట కూడా రియల్ హీరో అంటారు. పేద ప్రజలు, అనాథలు, వికలాంగుల కోసం తన చైతనైన సాయం చేస్తుంటారు. ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ప్రకృతి విపత్తు సమయంలో భారీ మొత్తంలో విరాళం ఇవ్వడమే కాదు..తన టీమ్ తో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత ఆపదలో ఉన్నవారికి ఖర్చు చేస్తే ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు లారెన్స్. ఈ మధ్యనే వికలాంగులకు బైక్స్ పంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా 10 మంది మహిళా ఆటో డ్రైవర్లకి లోన్లు క్లీయర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలిచారు.

ఇటీవల ఓ పది మంది మహిళా ఆటో డ్రైవర్లు తాము తీసుకున్న లోన్ డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారన్న వార్త తెలియగానే మా మనసు కరిగిపోయింది. అందుకే నేను, నా రోల్ మోడల్ రాఘవ లారెన్స్ మాస్టర్ కలిసి వారి లోన్లు కట్టేశాం.. ఇప్పుడు ఆ ఆటోలు వారి సొంతం’ అంటూ లారెన్స్ అభిమాని, నటుడు బాలన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. లారెన్స్ రాఘవ, బాలన్ పది మంది మహిళల వద్దకు స్వయంగా వెళ్లి వారి ఆటో డాక్యుమెంట్లను వారికి అందించారు. లారెన్స్ చేసిన సాయానికి ఆ మహిళలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.. ఆయన మెడలో దండలు వేసి హారతి ఇచ్చారు. అందులో ఓ మహిళ తన బిడ్డకు లారెన్స్ పేరు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా తన సంతోషాన్ని తెలిపింది.