Keerthi
బాలీవుడ్ స్టార్ హారో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన అనగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం అందింది. అయితే తాజాగా ఈ సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపింది తామేనని ఓ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఈ ఘటనకు పాల్పడింది ఎవరంటే..
బాలీవుడ్ స్టార్ హారో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన అనగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం అందింది. అయితే తాజాగా ఈ సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపింది తామేనని ఓ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఈ ఘటనకు పాల్పడింది ఎవరంటే..
Keerthi
బాలీవుడ్ స్టార్ హారో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన ఈరోజు అనగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం అందింది. అయితే బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు గుర్తుతెలియని దుండగలు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కానీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ కాల్పులు జరిపిన దుండగలు ద్విచక్రవాహనం పై వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన పై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. సల్మాన్ ఇంటి దగ్గర్లోని సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక కాల్పులు జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఇప్పటికే సల్మాన్ ఖాన్ పై చాలాసార్లు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపింది తామేనని ఓ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఈ ఘటనకు పాల్పడింది ఎవరంటే..
ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం పై ఈరోజు ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కాల్పులకు పాల్పడినది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తెలిసిందే. అలాగే, ఈ కాల్పులు చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా, ఇది ట్రైలర్ మాత్రమే అని పిక్చర్ ముందుందని షాకింగ్ పోస్ట్ చేశాడు.అంతేకాకుండా.. ఈ సారి ఇంటిపై కాల్పులు జరపమని, ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ నివాసం ఉన్న సల్మాన్ ఇంటి ముందు ఈ ఘటన జరగడంతో.. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసుల కూడా సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అయితే గతేడాది మార్చిలో కూడా సల్మాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు కొన్ని మెయిల్స్ కూడా చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా, గతంలో.. కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ ఆరోపించాడు. అలాగే ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక 2023లో ఏప్రిల్ కూడా ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ‘ఎక్స్’ గ్రేడ్ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు నిత్యం భద్రతగా ఉంటున్నారు. కానీ, తాజాగా సల్మాన్ ఇంటి పై ఇలా కాల్పులు జరపడం పై ఆయన ఇంటి చూట్టూ మరింత భద్రత బలగాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మరి, సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు పాల్పడినది తానేనని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ పోస్ట్ పెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.