iDreamPost
android-app
ios-app

Lavanya Tripathi: పెళ్లి తర్వాత ఆ మార్పు గురించి లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 03, 2024 | 4:08 PM Updated Updated Feb 03, 2024 | 4:48 PM

వెండి తెరపై నటించి.. ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎంతో మంది నటి నటులు.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి లావణ్య త్రిపాఠి తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో ఈ హీరోయిన్ పెళ్లి తర్వాత తన జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

వెండి తెరపై నటించి.. ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎంతో మంది నటి నటులు.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి లావణ్య త్రిపాఠి తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో ఈ హీరోయిన్ పెళ్లి తర్వాత తన జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

  • Published Feb 03, 2024 | 4:08 PMUpdated Feb 03, 2024 | 4:48 PM
Lavanya Tripathi: పెళ్లి తర్వాత ఆ మార్పు గురించి లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి నటించిన అన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అయితే, వాటి అన్నటికంటే కూడా ఇప్పుడు మెగా కుటుంబంలోని కోడలిగా ఆమెకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తోంది. కొంతకాలంగా తన సినిమాల ప్రస్తావన తీసుకురాని ఈ భామ.. తాజాగా ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో.. లావణ్య మీడియాతో మాట్లాడుతూ..ఆమె తన సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ అచితూచి వ్యవహరిస్తూనే ఉంటానని.. ఎక్కువ సినిమాలు చేయాలనే ఆరాటం తనకు లేదని తెలిపింది. అలాగే పెళ్లి తర్వాత తన కెరీర్ లో వచ్చిన మార్పులపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం.. నవంబర్ 1న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కొంతకాలం లావణ్య తన భర్తతో సమయం గడిపిన తర్వాత.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్సు ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమాల గురించి మాట్లాడుతూ.. తాను చేసిన కొన్ని సినిమాలైన మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్ని తనకంటూ ఓ గుర్తింపు తీసుకువచ్చాయని చెప్పింది. అలాగే పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. లావణ్య ఇలా ప్రస్తావించింది. ” పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమి మారలేదు.. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలని నాకెవరూ పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజ్ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా వచ్చారు.. ఇంతకంటే ఏం కావాలి.. గతంలో ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము. నా ప్రాజెక్ట్స్ విషయంలో వరుణ్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వడు.. ఎప్పుడైనా నేను సెలక్ట్ చేసిన స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడు.. మిస్ పర్ఫెక్ట్ సిరీస్ చూసి బాగుందని ప్రశంసించాడు.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఈ సిరీస్ ను విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. కాగా సుప్రియ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా కనిపించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సిరీస్ ఆడియన్సును ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా చేస్తున్నాని.. ఈ చిత్రాన్ని కొత్త డైరక్టర్ తెరకెక్కిస్తున్నారని తెలియజేశారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తెలుగుతో పాటు.. తమిళంలోను ఓ సినిమా చేస్తున్నానని తెలిపారు. మరి, మెగా వారి ఇంటి కోడలు.. లావణ్య త్రిపాఠి తన పెళ్లి తర్వాత కెరీర్ పై చేసిన వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş