iDreamPost
android-app
ios-app

Lavanya Tripathi: నిహారిక కోసం ఆ పని చేస్తా.. మెగా కోడలు లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jan 27, 2024 | 9:21 PM Updated Updated Jan 27, 2024 | 9:21 PM

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక గురించి ఓ ప్రశ్న ఎదురౌవగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక గురించి ఓ ప్రశ్న ఎదురౌవగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jan 27, 2024 | 9:21 PMUpdated Jan 27, 2024 | 9:21 PM
Lavanya Tripathi: నిహారిక కోసం ఆ పని చేస్తా.. మెగా కోడలు లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జంట ఎప్పుడూ కూడా తాము లవ్ లో ఉన్నామని బయటకు చెప్పలేదు. కానీ అభిమానులు మాత్రం మెుదటినుంచి కనిపెడుతూనే ఉన్నారు. మెుత్తానికి కొంత కాలం లవ్ బర్డ్స్ లా విహరించిన ఈ జంట గత సంవత్సరంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ‘మిస్ ఫర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అలరించనుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది మెగా కోడలు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక గురించి ఓ ప్రశ్న ఎదురౌవగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది లావణ్య. ఆ వివరాల్లోకి వెళితే..

‘మిస్ ఫర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత రాబోతున్న తొలి వెబ్ సిరీస్ ఇది. దీంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి డిస్నిప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా గత కొన్ని రోజులుగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తోంది లావణ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన ఆడపడుచు నిహారిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నిహారికకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. నిహారికతో ఎంతో సరదాగా ఉండే మీరు ఆమెకు ఆడపడుచు కట్నం కింద ఏమైనా ఇచ్చారా? అని యాంకర్ ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా లావణ్య మాట్లాడుతూ..”నిహారికకు ఆడపడుచు కట్నం కింద డబ్బులు ఏమీ ఇవ్వలేదు. కానీ తను మా ఫ్యామిలీ కాబట్టి తన కోసం ఏం చేయడానికైనా సిద్దమే. మంచి కథతో వస్తే.. తన బ్యానర్ లో నటించడానికి సిద్దం. ఆ మూవీ కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా సినిమా చేస్తా” అంటూ చెప్పుకొచ్చింది మెగా కోడలు లావణ్య. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. నిహారిక తొలిసారి తన విడాకుల గురించి స్పందించిన విషయం తెలిసిందే. నిహారిక వ్యాఖ్యలపై మాజీ భర్త చైతన్య సైతం రియాక్ట్ అయ్యాడు. మరి నిహారిక కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మూవీ చేస్తాను అన్న లావణ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio