iDreamPost
android-app
ios-app

పెళ్లి తర్వాత కూడా నా భర్త ఎలాంటి కండీషన్స్‌ పెట్టలేదు: లావణ్య

  • Published Jan 23, 2024 | 1:42 PM Updated Updated Jan 23, 2024 | 1:42 PM

పెళ్లి తర్వాత సినిమాలు చేయటంపై హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి స్పందించారు. మిస్‌ పరఫెక్ట్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి తర్వాత సినిమాలు చేయటంపై హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి స్పందించారు. మిస్‌ పరఫెక్ట్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Jan 23, 2024 | 1:42 PMUpdated Jan 23, 2024 | 1:42 PM
పెళ్లి తర్వాత కూడా నా భర్త ఎలాంటి కండీషన్స్‌ పెట్టలేదు: లావణ్య

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌-హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్‌ నెలలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి నేపథ్యంలో ఇద్దరూ సినిమాలకు కొంచెం బ్రేక్‌ ఇచ్చారు. వరుణ్‌ తేజ్‌ ఇప్పుడ మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోయారు. లావణ్య మాత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న తన సినిమాను ప్రమోట్‌ చేయటంలో బిజీ అయిపోయారు. ఆమె ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ అనే సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది.

ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదల అయింది. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న లావణ్య త్రిపాఠికి సినిమా భవిష్యత్తుకు సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. ఇందుకు లావణ్య సమాధానం ఇస్తూ.. ‘‘ నాకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అన్న తేడా లేదు. మంచి కథ దొరికితే చేసుకుంటూ పోతాను. మిస్‌ పర్‌ఫెక్ట్‌తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నా.

మెగా కోడలు ట్యాగ్‌తో బాధ్యతలు పెరిగాయి. పెళ్లి తర్వాత చేసే సినిమాలు, పాత్రల విషయంలో వరుణ్‌ కుటుంబం నాకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. వరుణ్‌ కూడా నేను ఇలాంటి పాత్రలే చేయాలని నాకు ఎలాంటి కండీషన్స్‌ పెట్టలేదు. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటకుండా సినిమాలు చేసుకుంటూ పోతాను’’ అని అన్నారు. ప్రస్తుతం లావణ్య చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాతో పాటు మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. కాగా, వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిలు ‘మిస్టర్’ అనే సినిమా చేశారు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్‌ సందర్భంగా ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత రెండు కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు. నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలను మానేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలకు లావణ్య చెక్‌ పెట్టారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చారు. మరి, పెళ్లి తర్వాత సినిమాలపై లావణ్య క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom