iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ తో వివాదం.. హీరోయిన్ ఆడియో లీక్ చేసిన లావణ్య!

  • Published Jul 05, 2024 | 9:21 PM Updated Updated Jul 05, 2024 | 9:21 PM

Raj Tarun- Lavanya leaked Audio Of Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఆమెతో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డింగ్ లీక్ చేసింది.

Raj Tarun- Lavanya leaked Audio Of Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఆమెతో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డింగ్ లీక్ చేసింది.

  • Published Jul 05, 2024 | 9:21 PMUpdated Jul 05, 2024 | 9:21 PM
రాజ్ తరుణ్ తో వివాదం.. హీరోయిన్ ఆడియో లీక్ చేసిన లావణ్య!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం బాగా వైరల్ అవుతోంది. రాజ్ తరుణ్ పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను ప్రేమ పేరుతో మోసం చేశాడు అంటు ఆరోపణలు చేసింది. అలాగే తిరగబడరా సామి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ కు రిలేషన్ ఉంది అంటూ ఆరోపించింది. మాల్వి మల్హోత్రా మాటలు వినే రాజ్ తరుణ్ ఇలా చేస్తున్నాడు అంటూ విమర్శించింది. ఆమె నుంచి తనకు ప్రాణహాని కూడా ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. అలాగే రాజ్ తరుణ్ కూడా లావణ్య ఆరోపణలు, ఫిర్యాదు చేయడంపై స్పందించాడు. తనకి ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు లావణ్య ఒక ఆడియో లీక్ చేయడం కలకలంగా మారింది.

లావణ్య ఈరోజు రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము 11 సంవత్సరాలుగా కలిసే ఉంటున్నాం అని చెప్పుకొచ్చింది. అలాగే కేవలం 3 నెలల క్రితమే రాజ్ తరుణ్ తన దగ్గరి నుంచి వెళ్లిపోయాడు అని తెలిపింది. అయితే డ్రగ్స్ కేసును వంకగా చూపిస్తున్నాడు.. కానీ, అతను నన్ను వదిలించుకోవాలి అని చూడటానికి కారణం హీరోయిన్ మాల్వీ మల్హోత్రా అంటూ ఆరోపణలు చేసింది. అలాగే ఆమెతో ఫోన్ లో మాట్లాడినప్పుడు చేసిన ఒక ఆడియో క్లిప్ ని మీడియాకు లీక్ చేసింది. అందులో మాల్వీ మల్హోత్రాని లావణ్య నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి మాటలు. మాల్వి మల్హోత్రా మాత్రం అతను నిన్ను వద్దు అనుకుంటున్నాడు కదా.. ఎందుకు ఫోర్స్ చేస్తావ్? నీకు చాలా జీవితం ఉంది అంటూ మాట్లాడుతోంది. ఆడియోలో నీ కాళ్లు పట్టుకుంటాను రాజ్ ని వదిలేయ్ అంటూ లావణ్య చెప్పుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş