iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ పై లావణ్య తండ్రి ఫైర్.. కొట్టేంత కోపం వస్తుందంటూ..

Lavanya, Raj Tarun: రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లావణ్య తండ్రి రాజ్ తరుణ్ పై ఫైర్ అయ్యాడు.

Lavanya, Raj Tarun: రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లావణ్య తండ్రి రాజ్ తరుణ్ పై ఫైర్ అయ్యాడు.

రాజ్ తరుణ్ పై లావణ్య తండ్రి ఫైర్.. కొట్టేంత కోపం వస్తుందంటూ..

గత కొద్ది రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే.. అది హీరో రాజ్ తరుణ్- లావణ్య ప్రేమ వ్యవహారమే. ఈ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నటుడు రాజ్ తరుణ్ తనని ప్రేమపేరుతో మోసం చేశాడని లావణ్య పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మరోసారి తనను పెళ్లి చేసుకున్నాడని, తనకు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపించింది. దీనికి సంబంధించి ఆధారాలు సమర్పించడంతో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లావణ్య తండ్రి రాజ్ తరుణ్ పై ఫైర్ అయ్యాడు. సంచలన కామెంట్స్ చేశాడు.

లావణ్య తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా కూతురుకు అన్యాయం చేస్తున్నాడు. అతడు మంచివాడని నమ్మాము. ఇప్పుడు లావణ్య డ్రగ్స్ తీసుకుందంటూ రాజ్ తరుణ్ ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నాడని మండిపడ్డాడు. రాజ్ తరున్ ని కొట్టేంత కోపం వస్తుందంటూ ఫైర్ అయ్యాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పెళ్లి చేసేందుకు రెడీ అయితే ముందుగా టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటాం.. ఆ తర్వాత గ్రాండ్ గా చేసుకుంటాం అని చెప్పాడని.. అతని మాటలు నమ్మామని ఇప్పుడిలా మోసం చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మా పాపను గాయపరిచాడు, ఇబ్బందులకు గురిచేశాడని చెప్పారు.

ఇది వరకు రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా మాతో బాగానే మాట్లాడే వారని గత మూడు నెలల నుంచి మాట్లాడ్డం మానేశారని తెలిపారు. ఇప్పటికైనా రాజ్ తరుణ్, లావణ్యను కలపాలనేదే మా ఉద్దేశ్యం అని వెల్లడించారు. రాజ్ తరుణ్ మనసు మార్చుకుని తన కూతురుతో కలిసి బ్రతికేందుకు అంగీకరిస్తే మేమే సపోర్ట్ చేస్తామని తెలిపారు. ఇక లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని తనని ఒత్తిడి చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. కేసు వాపస్ తీసుకుంటే తనకు రూ.5 లక్షలు ఇస్తామని మెసేజ్ లు పెడుతున్నట్లు చెప్పింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాని.. చట్టపరంగా ముందుకెళ్తానని తెలిపింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş