iDreamPost
android-app
ios-app

Manchu Lakshmi: ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు.. నన్ను కూడా వేధించారు: మంచులక్ష్మి

  • Published Aug 22, 2024 | 4:43 PM Updated Updated Aug 22, 2024 | 4:43 PM

Lakshmi Manchu-Hema Committee report: మంచు లక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తనను కూడా వేధించారంటూ చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

Lakshmi Manchu-Hema Committee report: మంచు లక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తనను కూడా వేధించారంటూ చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 22, 2024 | 4:43 PMUpdated Aug 22, 2024 | 4:43 PM
Manchu Lakshmi: ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు.. నన్ను కూడా వేధించారు: మంచులక్ష్మి

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది సర్వసాధారణం అన్నట్లుగా మారింది. ప్రతి ఇండస్ట్రీలో ఈ జాడ్యం ఉంది. కేవలం సినీ పరిశ్రమ అనే కాకుండా.. పని చేసే ప్రతి చోటా మహిళలు ఇలా వేధింపులకు గురవ్వడం సర్వసాధారణంగా మారింది. ఇక మిగతా రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఇండస్ట్రీలో ఇలాంటి లైంగిక వేధింపులు మరి కాస్త ఎక్కువ. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న అనేక చేదు అనుభవాల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎంతలా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారో వివరిస్తూ.. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వెల్లడించింది. దీనిలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి

ఈ క్రమంలో తాజాగా ఈ రిపోర్టుపై మంచు లక్ష్మి స్పందిస్తూ సంచలన కామెంట్స్‌ చేసింది. కెరీర్‌ ప్రారంభంలో తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది. మోహన్‌ బాబు లాంటి స్టార్‌ హీరో కుమార్తె అయిన మంచు లక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదంటే.. ఇండస్ట్రీలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ వార్త తెలిసిన వారు. హేమ కమిటీ రిపోర్టుపై స్పందిస్తూ.. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు పై విధంగా కామెంట్స్‌ చేశారు.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘‘మీకో విషయం చెబుతాను. జీవితంలో మహిళలకే అన్యాయ​ జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా.. సరే బాధితులు అంటే మహిళలే.  మనం దాన్ని ఎలా మార్చగలం.. మీకు మీరే పోరాడాలి. కెరీర్‌ ప్రారంభంలో నన్నూ పడేయాలని చూశారు. కానీ నేను నిలబడ్డాను. కొన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ నా వెంట పడుతున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నానని తెలుసు’’ అ‍న్నారు.

నన్నూ వేధించారు..

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవమే అని ఈ సందర్భంగా లక్ష్మి మంచు చెప్పుకొచ్చారు ‘‘ఈ వేధింపులు గురించి మీరు ఎలాగూ బయటకు చెప్పరన్న ధైర్యంతో చాలా మంది మీతో తప్పుగా ప్రవర్తించేందుకు చూస్తారు. అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెప్పాలి. కాకపోతే ఈ పని కాస్త కళాత్మకంగా ఉండాలి. మొదట్లో నన్నూ వేధించే వారు. వాళ్లతో చాలా కఠినంగా ఉండేదాన్ని. అలా చేయడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను’’ అని చెప్పుకొచ్చింది..

నేను అలా నో చెప్పడం వల్ల నా కెరీర్‌లో ఎన్నో అవకాశాలను కోల్పోయాను. కానీ ఇప్పుడు నేర్చుకున్నాను. మీకు నేను ఆకర్షణీయంగా కనిపించడం చాలా ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నాను. కానీ నాకు పెళ్లి అయింది అని చెబుతాను. అయినా అది అలాగే ముందుకు వెళ్తే సున్నితంగా తిరస్కరించి తప్పుకోండి’’ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap