iDreamPost
android-app
ios-app

సూర్యను ఒక్క రోజు పంపమన్న ఫ్యాన్ గర్ల్.. జ్యోతిక అదిరిపోయే రిప్లై!

  • Published Mar 21, 2024 | 4:28 PM Updated Updated Mar 21, 2024 | 4:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇందులో లేడీ అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ ఫ్యాన్ గర్ల్ సూర్య భార్య జ్యోతికను కోరరాని కోరిక కోరింది. ఇంతకు ఆమె ఏమీ రిప్లై ఇచ్చిందంటే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇందులో లేడీ అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ ఫ్యాన్ గర్ల్ సూర్య భార్య జ్యోతికను కోరరాని కోరిక కోరింది. ఇంతకు ఆమె ఏమీ రిప్లై ఇచ్చిందంటే..

  • Published Mar 21, 2024 | 4:28 PMUpdated Mar 21, 2024 | 4:28 PM
సూర్యను ఒక్క రోజు పంపమన్న ఫ్యాన్ గర్ల్.. జ్యోతిక అదిరిపోయే రిప్లై!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే టాలీవుడ్‪లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ తెలుగు హీరోలకు పోటీగా.. ఆయన సినిమాకు కూడా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టుకుంటాయి. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య చిత్రాలను ఆదరిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. రక్త చరిత్ర 2లో కనిపించడం తప్ప..మరో తెలుగు సినిమా చేయలేదు. ఇక సూర్య తన డబ్బింగ్ చిత్రాలకు ఇక్కడ వారికి చేరువయ్యారు. గజినీ, ఆరు, నువ్వు నేను ప్రేమ, సింగం, సెవన్త్ సెన్స్, 24, ఆకాశమే నీ హద్దురా, జైం భీమ్, ఈటీ, విక్రమ్ చిత్రాలు ఫ్యాన్స్ ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు కంగువాతో ఫుల్ బిజీలో ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది.ఇక ఆయన భార్య జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టేస్తుంది.

జ్యోతిక తెలుగులో ముచ్చటగా మూడు సినిమాలు చేసింది. ఠాగూర్, మాస్, షాక్ చిత్రాలతో అలరించింది. సూర్యను వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టాక.. బాధ్యతలు, బంధాలతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2015లో 36 వయదినిలే (36 వయస్సులో) రీ ఎంట్రీ.. ఇప్పుడు బాలీవుడ్ మూవీ సైతాన్‌తో భారీ హిట్ అందుకుంది. ఇండస్ట్రీలో ది బెస్ట్ కపుల్స్ లో సూర్య, జ్యోతిక పేరు కచ్చితంగా ఉంటుంది. అయితే సూర్యకు ప్రపంచ వ్యాప్తంగా లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అతడి కటౌట్‌కు ఫిదా అయిపోతుంటారు అమ్మాయిలు. సినిమా సినిమాకు లేడీ ఫ్యాన్స్ పెరిగిపోతుంటారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్స్ జ్యోతికను కోరకూడని కోరిక కోరింది. దీంతో జ్యోతిక అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

జ్యోతిక, సూర్య చివరి సారిగా రొమాన్స్ చేసిన చిత్రం సిల్లును ఒరు కాదల్(నువ్వు, నేను, ప్రేమ) . రీల్ కపుల్ రియల్ కపుల్ అవుతున్న తరుణంలో రిలీజ్ అయ్యింది ఈ చిత్రం. 2006లో వీరి పెళ్లికి మూడు రోజుల ముందు థియేటర్లలో సందడి చేసింది. మంచి హిట్ అందుకుంది. ఇందులో తొలుత భూమికను ప్రేమించి, పెళ్లి చేసుకోగా.. ఆమె తండ్రి విడదీస్తాడు. ఆ తర్వాత పెద్దలు చెప్పడంతో జ్యోతికను వివాహం చేసుకుంటాడు. వీరికి ఓ పాప కలుగుతుంది. కానీ ఓ సమయంలో భర్త రాసుకున్న డైరీని చదువుతుంది. అందులో ఐషు(భూమిక)తో ఓ రోజు గడపాలని రాసుకుంటాడు. ‘ఒక్క రోజు కలిసి ఉన్నా.. ఓ యుగం గడిపినంత తృప్తి ఉండేది. నాకా అదృష్టం లేదు’ అని పేర్కొంటాడు. చివరకు వీరిద్దరికీ ఓ రోజు కేటాయిస్తుంది భార్య జ్యోతిక.

Jyotika strong reply to suriya lady fan

ఇప్పుడు ఓ ఫ్యాన్ కూడా ఇలాంటి కోరికనే కోరింది. అయితే ఈ సారి జ్యోతికకే రిక్వెస్ట్ పెట్టుకుంది. ‘జ్యోతిక మామ్ సిల్లును ఒరు కాదల్ చిత్రంలోలా ఐషుకు ఇచ్చినట్లు సూర్యను ఓ రోజు నాకు ఇస్తారా అప్పుగా. గత 15 సంవత్సరాల నుండి ఆ జెంటిల్ మెన్ కు నేను బిగ్ ఫ్యాన్ ’ అంటూ రాసుకొచ్చింది ఓ ఫ్యాన్ గర్ల్. దీనికి జ్యోతిక రిప్లై ఇచ్చింది. అదీ అవ్వదమ్మా అంటూ కొంటె సమాధానం ఇచ్చింది జ్యోతిక. ‘నాట్ ఎలౌడ్’ అంటూ రిప్లై ఇచ్చే సరికి ఆమె కూడా ఓమై గాడ్.. రిప్లై ఇచ్చారా అని పేర్కొంటూ.. అతడు ఎప్పటికీ మీ వాడే అంటూ మళ్లీ సమాధామనిచ్చింది ఆ లేడీ ఫ్యాన్. ప్రస్తుతం ఈ ఇన్ స్టా ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో కొంత మంది జ్యోతిక పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss