Dharani
Laapataa Ladies: కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఓ చిన్న సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా కేవలం నెల రోజుల వ్యవధిలోనే. ఇంతకు అది ఏ సినిమా అంటే..
Laapataa Ladies: కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఓ చిన్న సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా కేవలం నెల రోజుల వ్యవధిలోనే. ఇంతకు అది ఏ సినిమా అంటే..
Dharani
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు.. బీభత్సమైపన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి.. వాటి మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచితే తప్ప.. ఆయా సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం, వసూళ్లూ సాధించడం అసాధ్యం. అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు చాలా అద్భుతాలు చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా.. థియేటర్లలో విడుదలై.. మౌత్ టాక్‌తోనే భారీ విజయాలు, వసూళ్లు సాధించి.. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ సినిమా ఇలాంటి నయా రికార్డే క్రియేట్ చేసింది. కేవలం 4 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం.. నెల రోజుల వ్యవధిలోనే నయా రికార్డులు క్రియేట్ చేసి ఔరా అనిపిస్తుంది. ఇంతకు అది ఏ సినిమా.. ఏంటా రికార్డు అంటే..
ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్షన్‌లో వచ్చిన సినిమా లపతా లేడీస్. ఆమిర్ ఖాన్.. ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. అతి తక్కువ కాలంలోనే సంచలన రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో.. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి.. భారీ విజయం సాధించింది. ఇక థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ఆతర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
థియేటర్లలో భారీ విజయం సాధించిన లపతా లేడీస్.. ఏప్రిల్ 26న ఓటీటీలో విడుదలైంది. ఇక థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. ఏకంగా యానిమల్ రికార్డ్‌ను బ్రేక్ చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓటీటీలో విడుదలైన 30 రోజుల్లోనే లపతా లేడీస్.. రికార్డ్ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సంపాదించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. రికార్డ్ స్థాయిలో 13.8 మిలియన్ల వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఇలాంటి ఘనత సాధించడం విశేషం అంటున్నారు.
ఇక ఇదే విషయాన్ని లపతా లేడీస్ డైరెక్టర్ కిరణ్ రావ్.. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. లపతా లేడీస్ సాధించిన ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది కిరణ్ రావ్. ఇక లపతా లేడీస్ సినిమాలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన ప్రాత్రల్లో నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్‌లోనే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలైంది.