iDreamPost
android-app
ios-app

ఖుషి ఓటిటి పార్టనర్ లాక్! స్ట్రీమింగ్ అయ్యేది ఎక్కడంటే?

  • Author ajaykrishna Updated - 03:41 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 03:41 PM, Fri - 1 September 23
ఖుషి ఓటిటి పార్టనర్ లాక్! స్ట్రీమింగ్ అయ్యేది ఎక్కడంటే?

ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. ఎంతటి స్టార్ హీరోల సినిమాలైనా.. థియేటర్స్ లో రిలీజ్ అవ్వకముందే ఓటిటి పార్టనర్ ని లాక్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్స్ లో విడుదలైన క్రేజీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన కొత్త సినిమా ‘ఖుషి’. రొమాంటిక్ లవ్ డ్రామా జానర్ లో ఈ సినిమాని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. పుష్ప ఫేమ్ మైత్రి మూవీస్ వారు ఖుషిని నిర్మించారు. కాగా భారీ అంచనాల మధ్య ఖుషి మూవీ.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

రిలీజ్ ముందునుండి సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసిన ఖుషి మూవీ.. తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. కాగా.. థియేటర్స్ లో ప్రస్తుతం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. విజయవంతంగా థియేట్రికల్ రన్ ప్రారంభించింది. దీంతో ఖుషి హిట్ కాస్త.. విజయ్ దేవరకొండకు ఐదేళ్ల తర్వాత హిట్ అందించినట్లు అవుతుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించి టాక్ విని.. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సైతం తన ఫస్ట్ రియాక్షన్ పోస్ట్ చేశాడు. మరోవైపు సమంత తన ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళింది. మొత్తానికి ఖుషి మూవీ థియేటర్స్ లో ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి.

ఈ సినిమాకు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురయ్యాయి. ఎందుకంటే.. ఖుషి మూవీలో విజువల్స్, మెయిన్ పెయిర్ కెమిస్ట్రీ అంతా కూడా మణిరత్నం తెరకెక్కించిన సఖి సినిమాని పోలి ఉందని అన్నారు. కానీ.. అవేవి నిజం కాదని.. స్టోరీ లైన్ సేమ్ అనిపించినా.. లోపల మ్యాటర్ వేరుందని డైరెక్టర్ శివ చెబుతూ వచ్చాడు. మరి ఫైనల్ జడ్జిమెంట్ ప్రేక్షకులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. ఖుషి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ స్ట్రీమింగ్ రైట్స్ కి సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి ఖుషి స్ట్రీమింగ్ థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక అనౌన్స్ అవుతుందేమో కాబోలు. మరి ఖుషి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbet