సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా పొందిన హీరోలు, హీరోయిన్స్ ఎవరైనా వ్యాపార రంగంలో కూడా అడుగు పెడుతుంటారు. ఇప్పటిదాకా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ అందరూ బిజినెస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. అయితే.. హీరోయిన్స్ అంటే ఎక్కువగా అందం, ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతుంటారు. కాబట్టి.. వారు ఎంచుకునే బిజినెస్ మార్గాలు కూడా అలాగే ఉంటాయి. తాము వీలు చిక్కినప్పుడల్లా ప్రమోషన్ చేసుకునే విధంగా హీరోయిన్స్ బిజినెస్ ప్రోడక్ట్ ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న కృతిసనన్.. తాజాగా సొంత బిజినెస్ లో అడుగుపెట్టింది.
ఇటీవల డార్లింగ్ ప్రభాస్ కి జోడిగా ఆదిపురుష్ సినిమాలో నటించిన కృతి.. ప్రస్తుతం వరుసగా బిగ్ స్టార్స్ సరసన సినిమాలు చేస్తూ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. కొద్దిరోజుల క్రితమే సొంత మూవీ ప్రొడక్షన్ హౌస్(బటర్ ఫ్లై ఫిలిమ్స్) ప్రారంభించి.. అందరిని సర్ప్రైజ్ చేసింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ని నెట్ ఫ్లిక్స్ తో పాటు నిర్మిస్తున్నట్లు ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రకటించింది. ఇంతలోనే ఇప్పుడు కొత్తగా తన పుట్టినరోజు సందర్బంగా.. సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. అయితే.. ఇప్పటివరకు మార్కెట్ లో ఉన్న వాటికంటే తన బ్రాండ్ మెరుగు అయ్యిందని ప్రచారం చేసుకుంటుంది. ఇంతకీ కృతి బ్రాండ్ పేరు ఏంటో తెలుసా.. హైఫెన్. ఈ పేరుతో కృతి తన బ్రాండ్ లాంచ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రమోట్ చేస్తుంది.
గతంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన.. టాలీవుడ్ లో తమన్నా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్.. లాంటి ముద్దుగుమ్మలు బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ విధంగా బాలీవుడ్ లో చూసుకుంటే.. కే బ్యూటీ అనే బ్రాండ్ ని కత్రినా కైఫ్ 2019లో లాంచ్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ అనోమలీ బ్రాండ్ ని 2022 ఆగష్టులో లాంచ్ చేసింది. అదే బాటలో సోనాక్షి సిన్హా.. నెయిల్ బ్రాండ్ గతేడాది సెప్టెంబర్ లో.. దీపికా పదుకొనే స్కిన్ కేర్ కోసం ’82°E’ అనే బ్రాండ్ 2022 నవంబర్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇవన్నీ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. అయితే.. కొత్తగా కృతి హైఫెన్ బ్రాండ్ లాంచ్ చేసేసరికి.. దాదాపు ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు విష్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం దీపికాని కాపీ కొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కృతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.