iDreamPost
android-app
ios-app

ఆదిత్య 999 పై స్పందించిన క్రిష్

  • Published Sep 01, 2025 | 12:31 PM Updated Updated Sep 01, 2025 | 12:31 PM

ఆదిత్య 999 సంబంధించి అడపా దడపా వార్తలు వింటూనే ఉన్నాము. ఇది బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్. ఆదిత్య 369 కు సిక్వెల్ తీయాలని ఆయన ఎప్పటినుంచో అనుకుంటున్నారు . పైగా ఈ సినిమాతో బాలకృష్ణ తనయుడిని ఇంట్రొడ్యూస్ చేయాలనీ అనుకుంటున్న సంగతి తెలియనిది కాదు.

ఆదిత్య 999 సంబంధించి అడపా దడపా వార్తలు వింటూనే ఉన్నాము. ఇది బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్. ఆదిత్య 369 కు సిక్వెల్ తీయాలని ఆయన ఎప్పటినుంచో అనుకుంటున్నారు . పైగా ఈ సినిమాతో బాలకృష్ణ తనయుడిని ఇంట్రొడ్యూస్ చేయాలనీ అనుకుంటున్న సంగతి తెలియనిది కాదు.

  • Published Sep 01, 2025 | 12:31 PMUpdated Sep 01, 2025 | 12:31 PM
ఆదిత్య 999 పై స్పందించిన క్రిష్

ఆదిత్య 999 సంబంధించి అడపా దడపా వార్తలు వింటూనే ఉన్నాము. ఇది బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్. ఆదిత్య 369 కు సిక్వెల్ తీయాలని ఆయన ఎప్పటినుంచో అనుకుంటున్నారు . పైగా ఈ సినిమాతో బాలకృష్ణ తనయుడిని ఇంట్రొడ్యూస్ చేయాలనీ అనుకుంటున్న సంగతి తెలియనిది కాదు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతోనే ఈ సినిమా సిక్వెల్ తీయాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రస్తుతం ఫార్మ్ లో కూడా లేరు సో. ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడిగా పరిశీలుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

దీని గురించి అప్పట్లో క్రిష్ ను అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదంట. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఘాటీ ప్రమోషన్స్ లో భాగంగా ఆదిత్య 999 ప్రస్తావన మరోసారి వచ్చింది. అయితే క్రిష్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుంది అనుకుంటే.. దాని గురించి బాలయ్యే ప్రకటించాలి.. తానూ ఏమి మాట్లాడలేనని తేల్చేసాడు క్రిష్. అంతేకాకుండా ఈ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడా లేదా అనేది కూడా చెప్పాల్సింది బాలయ్యే అని అన్నాడు.

సో ఏదైనా బాలయ్య నోటి నుంచి వినాల్సింది అన్నమాట. ఇక క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఓ ఇంటర్వ్యూలో దీని గురించి అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు . క్రిష్ నోటి నుంచి సమాధానం అయితే రాలేదు కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ప్రాజెక్ట్ అయితే లాక్ అయినట్టు సమాచారం. సో ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.