iDreamPost
android-app
ios-app

జూనియర్ యన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అదుర్స్-2 పక్కా!

  • Published Apr 03, 2024 | 5:53 PM Updated Updated Apr 03, 2024 | 5:53 PM

Kona Venkat Warning To Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే తారక్ కెరీర్లోనే బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన అదుర్స్ సినిమాకి సీక్వెల్ పై క్రేజీ వార్త అందుతోంది.

Kona Venkat Warning To Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే తారక్ కెరీర్లోనే బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన అదుర్స్ సినిమాకి సీక్వెల్ పై క్రేజీ వార్త అందుతోంది.

  • Published Apr 03, 2024 | 5:53 PMUpdated Apr 03, 2024 | 5:53 PM
జూనియర్ యన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అదుర్స్-2 పక్కా!

కోన వెంకట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన రైటింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు రైటర్ గా పని చేశాడు. ఆ మూవీస్ సూపర్ సక్సెస్ కావడమే కాకుండా.. ఇప్పటికీ ఆ చిత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి రైటర్ ఇప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చుంటాను అంటూ కామెంట్స్ చేశాడు. కావాలంటే నిరాహార దీక్ష కూడా చేస్తాను అంటూ చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. మరి.. అసలు కోన వెంకట్ ఎందుకు అలా అన్నాడు? తారక్ ఇంటి ముందు కూర్చుని ఆయనకు నిరహార దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

కోన వెంకట్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రచయితగా వ్యవహరించిన వెంకీ, ఆంధ్రావాలా, సాంబ, శివమణి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఢీ, రెడీ, అదుర్స్, బాద్ షా ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. వాటిలో అదుర్స్, వెంకీ సినిమాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. ఈ చిత్రాలకు సీక్వెల్స్ విషయంలో ఇండస్ట్రీలో ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయిపోయాయి. వెంకీ రీరిలీజ్ రెస్పాన్స్ చూసిన తర్వాత సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన వచ్చినట్లు శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ గురించి ఆలోచన జరుగుతోంది. ఇప్పుడు కోన వెంకట్ కొన్ని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆయన అదుర్స్ సీక్వెల్ పై స్పందించారు.

Adhurs2

అదుర్స్ 2 సినిమాని కచ్చితంగా తెరకెక్కించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. ఆ విషయంలోనే అవసరం అయితే తారక్ ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చుంటాను అన్నారు. తారక్ గనుక ఒప్పుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతాను అంటున్నాడు. అలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్ 2 సినిమా చేయిస్తానని చెబుతున్నాడు. అదుర్స్ సినిమాలో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి కూడా కోన వెంకట్ కామెంట్స్ చేశాడు. ఆ తరహా డైలాగ్ డెలివరీ, డైలాగ్ మాడ్యులేషన్, అలాంటి డ్రెస్సింగ్, క్యారెక్టర్స్ లో వ్యత్యాసం చూయించడం, చేయగలగడం అంత తేలిక కాదన్నారు. అలాంటి పాత్రను ఇండియాలోనే తారక్ ఒక్కడే చేయగలడు అంటూ కోన వెంకట్ ప్రశంసలు కురిపించాడు. కోన వెంకట్ ధీమా చూసి తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఆనందానికి అర్థం ఉంది. తారక్ కెరీర్లోనే అదుర్స్ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది అంత తేలిక కాదు అనే విషయం కోన వెంకట్ కి కూడా తెలుసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తారక్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇలాంటి సమయంలో అలాంటి క్యారెక్టర్స్ చేస్తాడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు తారక్ ఏది చేసినా కూడా అది పాన్ ఇండియా సినిమానే అవుతుంది. మరి.. అదుర్స్ మూవీకి పాన్ ఇండియా లెవల్లో సీక్వెల్ తీయగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి.. అదుర్స్ కి సీక్వెల్ వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss