iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న తండ్రీకూతుళ్లది మామూలు రేంజ్ కాదు.. సౌత్‌లోనే బిగ్ స్టార్..!

  • Published Aug 23, 2024 | 3:04 PM Updated Updated Aug 23, 2024 | 3:04 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న తండ్రీ కూతుళ్లది మామూలు బ్యాగ్రౌండ్ కాదు. ఇద్దరు ఇద్దరే. ఒకరు బిగ్ స్క్రీన్ పై రఫ్ ఆడించేస్తుంటే.. మరొకరు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ.. ఇంతకు ఈ ఇద్దరు ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న తండ్రీ కూతుళ్లది మామూలు బ్యాగ్రౌండ్ కాదు. ఇద్దరు ఇద్దరే. ఒకరు బిగ్ స్క్రీన్ పై రఫ్ ఆడించేస్తుంటే.. మరొకరు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ.. ఇంతకు ఈ ఇద్దరు ఎవరంటే..?

  • Published Aug 23, 2024 | 3:04 PMUpdated Aug 23, 2024 | 3:04 PM
ఈ ఫోటోలో ఉన్న తండ్రీకూతుళ్లది మామూలు రేంజ్ కాదు.. సౌత్‌లోనే బిగ్ స్టార్..!

ఈ పిక్‌లో కనిపిస్తున్న తండ్రీ కూతుళ్లది మామూలు బ్యాగ్రౌండ్ కాదు. ఒకరు వెండితెరపై, మరొకరు సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నాన్న కూచిగా ఉన్న ఈ అమ్మాయి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటే.. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్, ఆయన ముద్దుల తనయ జస్వంతి రవికుమార్. కేఎస్ రవికుమార్ ఫిల్మ్ డైరెక్టరే కాదు.. ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, యాక్టర్ కూడా. సాధారణంగా ఒకరికి ఒక ఇండస్ట్రీలో హిట్ ఉంటుంది. కానీ ఈ దర్శకుడు ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ తీయడం అలవాటుగా మారిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి మొదలైన ఆయన ప్రయాణం.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతుండటం గమనార్హం. భారతీ రాజా, విక్రమన్, ఇ రాందాస్, నగేష్, రామరాజన్ వంటి దిగ్గజ దర్శకుల దగ్గర వర్క్ చేశాడు రవి కుమార్.

1990లో ఓ క్రైమ్ థ్రిల్లర్ దర్శకుడిగా కెరీర్ స్టార్ చేశాడు కేఎస్ రవికుమార్. పేరుకు తమిళ దర్శకుడే అయినా.. ఆ ఇండస్ట్రీతోనే ఆగిపోలేదు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు తీసి, హిట్స్ ఇచ్చి ట్రెండ్ సెట్ చేశాడు. కమల్ హాసన్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన భామనే సత్య భామనే, తెనాలి, పంచ తంత్రం, దశవతారం, మన్మధ బాణం చిత్రాలు ఆయన తెరకెక్కించినవే. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ముత్తు, నరసింహ, లింగ వంటి చిత్రాలు తీశాడు కేఎస్ రవికుమార్. తెలుగులో కూడా స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించాడు ఈ దర్శక ధీరుడు. చిరంజీవితో స్నేహం కోసం, నాగార్జున బావ నచ్చాడు, రాజ శేఖర్‌తో విలన్, బాలయ్యతో జై సింహ, రూలర్ మూవీస్ చేశాడు. మాస్ అండ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట ఈ డైరెక్టర్.

ks ravi kumar daughter pic talk

దర్శకుడిగా కాకుండా యాక్టర్‌గా కూడా ఎన్నో చిత్రాల్లో నటించాడు. తను రూపొందించి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం ఆయనకు అలవాటు. ఈ మధ్య పూర్తి స్థాయిలో గూగుల్ కట్టప్పలో మెరిశాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రొడ్యూసర్‌గానూ కొనసాగుతున్నారు. ఇక ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ఇంత సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లడానికి ఆయన ఫ్యామిలీనే కారణం. ఆయన భార్య పేరు కర్పగం. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కుమార్తె జనని రవి కుమార్, రెండో కూతురు మాలిక్ రవికుమార్, మూడో కూతురు జస్వంతి రవి కుమార్. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా, ఇప్పుడు జనని పెళ్లికి రెడీ అవుతుంది. ఇటీవల ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగింది. మిగిలిన ఇద్దరితో పోల్చుకుంటే.. ఈమె సోషల్ మీడియాలో వెరీ ఫేమస్. ఆమెకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా, మోడల్‌గా, ఫోటో షూట్స్ చేస్తూ ఫేమ్ నేమ్ తెచ్చుకుంది. త్వరలో జస్వంతి పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Jasvanthi Ravikumar (@jashlett)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş