iDreamPost

Parking Movie: ‘పార్కింగ్’ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం!

Parking Movie In Oscar Library: గతేడాది డిసెంబర్ లో విడుదలైన కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిటైన సినిమా ‘పార్కింగ్’. కోలీవుడ్ లో సూపర్ హిట్  టాక్ తో భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా  పార్కింగ్ సినిమాకు అరుదైన గౌరవం లభించింది.

Parking Movie In Oscar Library: గతేడాది డిసెంబర్ లో విడుదలైన కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిటైన సినిమా ‘పార్కింగ్’. కోలీవుడ్ లో సూపర్ హిట్  టాక్ తో భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా  పార్కింగ్ సినిమాకు అరుదైన గౌరవం లభించింది.

Parking Movie: ‘పార్కింగ్’ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం!

ఇటీవల కాలంలో చాలా సినిమాలు సూపర్ హిట్ కొడుతున్నాయి. చిన్న సినిమాలుగా  వచ్చి..పెద్ద హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి. అందరి అంచనాలను తలక్రిందులుగా చేస్తూ…సక్సెస్ ను అందుకుంటున్నాయి. అలా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా వచ్చి..హీట్ అందుకున్న కోలీవుడ్ సినిమానే ‘పార్కింగ్’. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. తాజాగా  పార్కింగ్ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గతేడాది డిసెంబర్ లో విడుదలైన కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిటైన సినిమా ‘పార్కింగ్’. వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కోలీవుడ్ లో సూపర్ హిట్  టాక్ తో భారీ వసూళ్లు రాబట్టింది. అద్దె కారు యజమాని వారి జీవితంలో ఎదుర్కొనే నిజ జీవిత సమస్యల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో విడుదలైన నెలరోజుల లోపే.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో కూడా ఈ సినిమా సందడి చేసింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది.

A rare honor for the movie 'Parking' at the international level! 02

పార్కింగ్ సినిమా స్క్రీన్ ప్లే ఏకంగా ఆస్కార్ లైబ్రరీలో స్థానం లభించింది. ఇదే విషయాన్ని ఆస్కార్‌ మేనేజింగ్‌ లైబ్రేరియన్‌ ఫిలిఫ్‌ గార్సియా అధికారికంగా ప్రకటించిందని సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ఆస్కార్ బృందం ఈ మెయిల్ చేశారని పార్కింగ్ మూవీ ప్రొడ్యూసర్ కేఎస్ సినీష్ సోషల్ మీడియ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.  ఇక అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించడంతో పార్కింగ్ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక పార్కింగ్ మూవీ కథ విషయానికి వస్తే..  పార్కింగ్ విషయంలో జరిగే గొడవ..సృష్టించే అలజడి చుట్టు సాగుతుంది. ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇద్దరు వ్యక్తుల మధ్య పార్కింగ్ విషయంలో చిన్న వాగ్వాదం మొదలవుతుంది. ఇద్దరి ఈగోల కారణంగా చిన్న గొడవ కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్తోంది. చివరికి తమ తప్పులు తెలుసుకొని మారిపోయి…మునుపటిలా ఉంటారు. ఈ మధ్యలోనే అనేక ట్విస్టులతో ఈ సినిమా సాగుతోంది. ఈ సినిమాలో హరీష్‌ కల్యాణ్, ఎమ్‌ఎస్‌ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

రూ. 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.15 కోట్లకు పైగా రాబట్టింది. విడుదలైన అన్ని భాషాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. మరి ఇప్పటివరకు ఎవరైనా ఈ సినిమా చుడనివారు ఉంటే వెంటనే చూసేయండి. మొత్తంగా పార్కింగ్ మూవీకి అరుదైన గౌరవం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి