iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ తో ఆ సినిమా చేయడానికి కారణం అదే: హీరో ప్రశాంత్

  • Published Aug 08, 2024 | 2:00 AM Updated Updated Aug 08, 2024 | 9:14 AM

Prasanth: కోలీవుడ్ హీరో ప్రశాంత్ తాజాగా ఆయన 'అంధగన్' అనే చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ను ముందకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రశాంత్ రామ్ చరణ్ తో నటించిన వినయ విధయ రామ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Prasanth: కోలీవుడ్ హీరో ప్రశాంత్ తాజాగా ఆయన 'అంధగన్' అనే చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ను ముందకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రశాంత్ రామ్ చరణ్ తో నటించిన వినయ విధయ రామ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Published Aug 08, 2024 | 2:00 AMUpdated Aug 08, 2024 | 9:14 AM
రామ్ చరణ్ తో ఆ సినిమా చేయడానికి కారణం అదే: హీరో ప్రశాంత్

హీరో ‘ప్రశాంత్’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఒకప్పుడు లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో ఈ హీరోకు చాలా క్రేజ్ ఉండేది. ముఖ్యంగా అప్పటిలో ఈ హీరో అంటే అమ్మాయిలకు ఫుల్ క్రష్. పేరుకు తమిళ్ హీరో అయిన ప్రశాంత్ కు.. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా ఈయన టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఒక్క సినిమా కూడా చేయకపోవడం గమన్హారం. ఇకపోతే మొదటిగా ప్రేమ శిఖరం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు ప్రశాంత్. అయితే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత తొలిముద్దు, జీన్స్, ప్రేమకావ్యంలో సినిమాలో నటించాడు. అయితే సినిమాలన్ని తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి.

అయితే వీటన్నింటి కన్నా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 1998లో రిలీజ్ అయిన జీన్స్ మూవీ ప్రశాంత్ కు మంచి సక్సేస్ అందించడమే కాకుండా.. ఫుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇక ఇదులో ఇందులో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ పూర్తిగా తమిళ్ ఇండస్ట్రీకే పరిమితమై అక్కడే పలు సినిమాలు చేశాడు. ఇకపోతే చాలా ఏళ్ల తర్వాత ప్రశాంత్ రామ్ చరణ్ వినయ విధేయ రామ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ 2019లో రిలీజైంది. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కు అన్నయ్య గా ప్రశాంత్ నటించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరో అంధగన్’ అనే చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ను ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ రామ్ చరణ్-బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాలో ఆ కారణంతోనే నటించానని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

hero prasanth about ram charam movie

కోలీవుడ్ హీరో ప్రశాంత్..  తాజాగా ఆయన ‘అంధగన్’ అనే చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ను ముందకు రాబోతున్నాడు. కాగా, ఈ మూవీ  ఆగస్టు 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇందులో సిమ్రాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన  ‘వినయ విధేయ రామ’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘మాకు ఓ నిర్మాణ సంస్థ ఉంది. అందుకే మా బ్యానర్‌లోనే ఎక్కువగా సినిమాలు చేశాను. అయితే వేరే నిర్మాణ సంస్థలతో ఎక్కువగా వర్క్‌ చేయకపోవడానికి ప్రధాన కారణం ఇతరులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేను కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

కానీ, ఇప్పుడు నా లైఫ్‌ చాలా మారడమే కాకుండా.. వరుసగా సినిమాలు చేస్తున్నా. అయితే తెలుగులో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించడానికి స్నేహం ఒక్కటే కారణం. బోయపాటి శ్రీను తెలుగులో పెద్ద దర్శకులు. ఆయన చెప్పిన పాత్రకి నేను న్యాయం చేయగలనని నమ్మి నా దగ్గరకి వచ్చారు. పైగా రామ్‌చరణ్‌ అంటే నాకు అభిమానం ఉంది. పైగా ఎంతోకాలం నుంచి మా మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. అందుకే ఆ ప్రేమ వల్లే నేను  ఆ సినిమాలో నటించాను’ అంటూ ప్రశాంత్‌ చెప్పుకొచ్చారు. మరీ, ప్రశాంత్ రామ్ చరణ్ వినయ విధయ రామ సినిమా పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş