iDreamPost
android-app
ios-app

సినిమాల్లో అమాయకంగా కనిపించే ఈ కమెడియన్ బ్యాగ్రౌండ్ తెలుసా? నమ్మలేరు!

  • Published Aug 08, 2024 | 4:55 PM Updated Updated Aug 08, 2024 | 4:55 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ కమెడియన్. అయితే చూడటానికి అమాయకంగా, కమెడిగా కనిపించే ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ కమెడియన్. అయితే చూడటానికి అమాయకంగా, కమెడిగా కనిపించే ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Aug 08, 2024 | 4:55 PMUpdated Aug 08, 2024 | 4:55 PM
సినిమాల్లో అమాయకంగా కనిపించే ఈ కమెడియన్ బ్యాగ్రౌండ్ తెలుసా? నమ్మలేరు!

ఇండస్ట్రీకి టాలెంటెడ్ యాక్టర్స్ పరిచయమవ్వడం కొత్తేమీ కాదు. కానీ, ఆ ఇండస్ట్రీలోనే మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోయే నటులు చాలా తక్కువగా ఉంటారు. అయితే ఇప్పటి వరకు వెండితెరపై ఇలా మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ గా కొనసాగిన వారిలో హీరో, హీరోయిన్లను మాత్రమే చూసి ఉంటాం. కానీ, ఓ కామెడియన్ మల్టి టాలెంటెడ్ గా ఇండస్ట్రీలో రాణించడం అనేది చాలా అరుదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ కమెడియన్ మాత్రం.. నటుడు,కమెడియన్ గా మాత్రమే కాకుండా.. పాటల రచయిత, గాయకుడిగా, మ్యూజిక్ కంపోజర్ గా ఇలా అన్ని ప్రొఫెషన్స్ లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ, ఆయన ఎవరో కాదు..కోలీవుడ్ నటుడు ‘ప్రేమ్ జీ అమరెన్’.

ఈయన అసలు పేరు ‘ప్రేమ్ కుమార్ గంగై అమరెన్’. అయితే ఈ పేరుతో పెద్దగా ఎవరికీ పరిచయం లేదు కానీ, హీరో సూర్య నటించి ‘రాక్షసుడు’ మూవీలో హీరోకు ఫ్రెండ్ గా నటించిన జెట్టు అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే..ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది కాబట్టి తెలుగు ఆడియోన్స్ ప్రేమ్ జీని ఈజీగా గుర్తుపడతారు. నిజానికి ప్రేమ్ జీ డైరెక్ట్ గా ఒక్క సినిమా కూడా తెలుగులో చేయలేదు. ఈయన ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించాడు. ఈ విషయం పక్కన పెడితే.. అయితే చూడటానికి అమాయకంగా కనిపించిన ప్రేమ్ జీ బ్యాక్ గ్రౌంత్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. మరీ ఆయన సినీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కోలీవుడ్ కమెడియన్ ప్రేమ్ జీ.. ఈయన తమిళనాడులోని జననం 26 ఫిబ్రవరి 1979 జన్మించారు. ఇకపోతే ఈయన ప్రముఖ డైరెక్టర్, సంగీత విద్వాంసుడు గంగై అమరన్ కుమారుడు కావడం గమన్హారం.దీంతో ప్రేమ్ జీ చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండటంతో.. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వద్ద సహాయకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా ప్లే బ్యాక్ సింగర్ గా మరారు. ఈ క్రమంలోనే.. యువన్ శంకర్ రాజా సంగీతంలో ప్రేమ్‏జీ చాలా వరకు ర్యాప్ సాంగ్స్ పాడారు. అలాగే సౌండ్ ట్రాక్ ఆల్బమ్స్ కోసం తన కంపోజిషన్‌లలో కొన్నింటిని ప్రేమ్ జీ రీమిక్స్ కూడా చేశాడు. అయితే ఇలా సంగీతంలో తన ప్రతిభను కనుభరిస్తున్న ప్రేమ్ జీకి అనూహ్యంగా 2006లో ‘సిలంబరసన్‘ తెరకెక్కించిన వల్లవన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఆ సినిమా ద్వారా ప్రేమ్ జీ వెండితెరపై ఇంట్రీ ఇచ్చాడు. ఇక మొదటి సినిమాలోనే కీలకపాత్ర పోషించిన ప్రేమ్ జీ నటుడిగా మంచి మార్కులు వేసుకున్నాడు. ఆతర్వాత అతడి సోదరుడు తెరకెక్కించిన ‘చెన్నై 600028’ చిత్రంలో నటించాడు.

అయితే ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో ప్రేమ్ జీ నటించాడు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రేమ్‏జీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో అప్పటి నుంచి వరుసగా తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు ప్రేమ్ జీ. అలాగే ఓ వైపు కమెడియన్ గా అలరించడమే కాకుండా..  మ్యూజిక్ కంపోజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇకపోతే ఈయన చివిరిగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా తమిళ్ వెర్షన్ లో నటించాడు. అయితే ప్రస్తుతం ఈయన వయసు 45 ఏళ్ల. అయితే ఇన్నేళ్లు సింగల్ గా ఉన్న ప్రేమ్ జీ ఇటీవలే ఇంధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరీ, కమెడీయన్ ప్రేమ్ జీ సినీ బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.