iDreamPost
android-app
ios-app

ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకొను .. తెలుగు హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • Published Aug 23, 2024 | 3:23 PM Updated Updated Aug 23, 2024 | 3:23 PM

సినీ ఇండస్ట్రీలో క్యాష్టింగ్ కౌచ్ సమస్య అనేది అందాల ముద్దుగుమ్మలకు ఎప్పుడు నీడలా వెంటాడుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ సమస్యను నేను కూడా ఎదుర్కొన్నని ఓ తెలుగు నటి మీడియా ముందు పేర్కొంది. అంతేకాకుండా.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనూ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో క్యాష్టింగ్ కౌచ్ సమస్య అనేది అందాల ముద్దుగుమ్మలకు ఎప్పుడు నీడలా వెంటాడుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ సమస్యను నేను కూడా ఎదుర్కొన్నని ఓ తెలుగు నటి మీడియా ముందు పేర్కొంది. అంతేకాకుండా.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనూ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

  • Published Aug 23, 2024 | 3:23 PMUpdated Aug 23, 2024 | 3:23 PM
ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకొను .. తెలుగు హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే.. గత కొన్నేళ్లుగా ఈ పదం ఇండస్ట్రీలో కానీ, సోషల్ మీడియాలో కానీ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా వెండితెర తారల దగ్గర నుంచి బుల్లితెర ఆర్టిస్టుల వరకు ఈ సమస్యలను ఎదుర్కొన్న వాళ్లు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా.. చాలామంది అందాల ముద్దుగుమ్మలు తాము ఎదుర్కొన్న సమస్యను ధైర్యంగా బయటకు చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ అనే భూతం నాటి నుంచి నేటి వరకు లేడీ ఆర్టిస్టులకు వెంటాడుతునే ఉంది. ముఖ్యంగా అవకాశాల పేరిట ఇండస్ట్రీలోని తారలను.. స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శక, నిర్మాతల వరకు ప్రతిఒక్కరూ వివిధ రకాలుగా ఇబ్బంది పడేవారు. అయితే ఇంతవరకు ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య అనేది టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా వినిపించింది. కానీ, మొదటి సారి తాజాగా ఓ కోలివుడ్ నటి తాను కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నని ధ్యైరంగా మీడియా ముందకు వచ్చి చెప్పుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

తాజాగా కోలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ ‘స‌న‌మ్ శెట్టి’ మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. కాగా, ప్రస్తుతం ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా సనమ్ శెట్టి మాట్లాడుతూ..  ‘ఓ ఆడపిల్లను తన అనుమతి లేకుండా తాకడానికి ఎవరికీ అధికారం లేదు. ఇకపోతే నేనూ ఓ నటిని, ఎంటర్‌టైన్‌ చేయడమే మాత్రమే నా వృత్తి.  అంతేకానీ, ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూవివాదాస్పద వాఖ్యలు చేసింది. అలాగు సమాజం ఎంత మారినా మ‌హిళ‌లు ఎంత ఉన్న‌త చ‌దువులు చ‌దివినా అన్ని రంగాల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇటీవలే మలయాళ ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన‌ నివేదిక గురించి తెలిసి నేను చాలా షాకయ్యాను.

sanam shetty interesting comments

ఎందుకంటే.. అక్కడ ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఇక్కడ కూడా అలాంటి ఆరాచాకలే జరుగుతున్నాయి. కానీ, దీనిన బయట పెట్టానికి ఎవరు ముందుకు రావడం లేదు. అయితే దురదృష్టవశాత్తు నేనుకూడా ఈ చేదు ఘటనలను ఎదుర్కొన్నాను అంటూ సనమ్ షెట్టి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. కోల్‌కతాలో జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తూ.. అక్కడ రీక్లెయిమ్ ది నైట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ, నేను దానిని చెన్నైలో క్లెయిమ్ ది నైట్‌గా ప్రారంభించాలనుకుంటున్నా అన్నారు. ఈ నిరసనలో నాతో కలిసి బాధితురాలికి న్యాయం చేయడంలో సాయం చేయాలని కోరుతున్నానని’ సనమ్ శెట్టి పేర్కొంది.

ఇకపోతే సనమ్ శెట్టి 2012లో త‌మిళంలో వ‌చ్చిన అంబులి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే మిస్ సౌత్ ఇండియా సనమ్ శెట్టి ఆ త‌ర్వాత.. త‌మిళంలో పాతిక సినిమాల వ‌ర‌కు చేసింది. కానీ కెరీర్ పరంగా పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు. ఇక తెలుగులో మ‌హేశ్ బాబు శ్రీమంతుడులో ఓ చిన్న క్యారెక్ట‌ర్‌తో పాటు సంపూర్ణేశ్ బాబు సింగం 123, బిగ్‌ బాస్ మాన‌స్ హీరోగా వ‌చ్చిన‌ ప్రేమికుడు సినిమాలో కూడా సనమ్ హీరోయిన్‌గా నటించింది. మరీ సనమ్ కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet