iDreamPost
android-app
ios-app

అప్పుడు బాపు బొమ్మలా.. ఇప్పుడు అందాల అప్సరసలా! ఈమెని గుర్తుపట్టారా?

  • Published Apr 17, 2024 | 4:09 PM Updated Updated Apr 17, 2024 | 4:09 PM

ఈ ఫోటోలో పంజాబీ డ్రెస్సులో బాపు బొమ్మలా, తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయ్యింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో పంజాబీ డ్రెస్సులో బాపు బొమ్మలా, తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయ్యింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Apr 17, 2024 | 4:09 PMUpdated Apr 17, 2024 | 4:09 PM
అప్పుడు బాపు బొమ్మలా.. ఇప్పుడు అందాల అప్సరసలా! ఈమెని గుర్తుపట్టారా?

ఇటీవల కొంత మంది నటీమణులు ఒక్క సినిమాతోనే క్లిక్ అవుతున్నారు. యాక్టింగ్ స్కిల్ ఒకటైతే.. గ్లామరస్ అండ్ బోల్డ్ సీన్లకు నో చెప్పడం కూడా సక్సెస్ బాట పట్టేలా చేస్తుంది. లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు, బికినీ వంటి కురచ దుస్తులకు నో చెబుతున్నారు. అలాంటి ముద్దుగుమ్మలకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇలా గ్లామరస్ పాత్రలతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంటున్నారు. అందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీనే ఓ ఉదాహరణ. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. యానిమల్ చిత్రంతో వచ్చింది. రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా అవతరించింది. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది ఈ ఫోటోలోని బ్యూటీ కూడా. చూడటానికి సాదా సీదాగా కనిపిస్తున్న అమ్మాయి.. సోషల్ మీడియాలో సెగలు రేపుతూ ఉంటోంది.

బాపు బొమ్మలా చాలా చక్కగా పంజాబీ డ్రెస్ ధరించి.. చిరు మందహసంగా నవ్వులు రువ్వుతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ఒక్క సినిమాతోనే అన్ని ఇండస్ట్రీల కుర్రాళ్ల చూపులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఆమె నటనకు ఫిదా కావడమే కాదు.. హాట్ అండ్ స్టన్నింగ్ లుక్స్‌కు పడిపోయారు యువకులు. ఇప్పుడు తెలుగులో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. గ్లామర్ షోకు ఏ మాత్రం అడ్డు చెప్పని ఈ ముద్దుగుమ్మ పేరు దివ్యభారతి. తమిళ్ సినిమా బ్యాచులర్ మూవీతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ కోలీవుడ్ సోయగం. జీవి ప్రకాష్‌తో ముద్దులు, రొమాన్స్‌తో సినీ లవర్స్‌ను హీట్ పుట్టించింది అమ్మడు. ఆ తర్వాత మదిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజా వంటి చిత్రాలు చేసింది. జర్నీ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.

ఇప్పుడు బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ సరసన ఆడిపాడేందుకు సిద్ధమైంది. బుల్లితెర సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఈ తమిళ పొన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదొక కామెడీ రొమాంటిక్ చిత్రం. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. 1992లో పుట్టిన దివ్యభారతి.. తెలుగు కుర్రకారు మదిని మరింత మెలిపెట్టేందుకు ఫిక్స్ అయ్యింది. గోట్ కనుక సక్సెస్ అయితే.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం. దీంతో పాటు ఆసై అనే తమిళ సినిమా కూడా చేస్తుంది. అలాగే లింగం అనే ఓటీటీ మూవీ చేస్తోంది. ఇవన్నీ రిలీజ్ అయితే.. ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio