iDreamPost
android-app
ios-app

డేనియల్‌ బాలాజీ గొప్పతనం.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాడు

  • Published Mar 30, 2024 | 11:42 AM Updated Updated Mar 30, 2024 | 11:50 AM

కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా అలరించిన డేనియల్ బాలాజీ చనిపోతూ కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం బాలాజీ సజీవంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనితో.. లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఇంతకి బాలాజీ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా అలరించిన డేనియల్ బాలాజీ చనిపోతూ కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం బాలాజీ సజీవంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనితో.. లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఇంతకి బాలాజీ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Mar 30, 2024 | 11:42 AMUpdated Mar 30, 2024 | 11:50 AM
డేనియల్‌ బాలాజీ గొప్పతనం.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాడు

కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (48) హఠత్తుగా మృతి చెందారు. కాగా, ఈయన శుక్రవారం అర్థరాత్రి ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రవైటు ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు బాలాజీ హాస్పిటల్ కు తరలించేలోపే గుండేపోటుతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు,. ఇక బాలాజీ మరణ వార్త తెలియడంతో అటు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా ఆయన మృత పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా అలరించిన డేనియల్ బాలాజీ చనిపోతూ కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం బాలాజీ సజీవంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనితో.. లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఇంతకి బాలాజీ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు శరీరంలో ఉన్న ప్రధానమైన అవయవాలు అనగా.. కళ్లు, కీడ్నీలను దానర్థం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డేనియల్‌ బాలాజీ కూడా తాను మరణించినప్పుడు తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కాగా, ఆయన చనిపోతూ మరో ఇద్దరికి చూపును ఇవ్వలనది తన ఆశయం. అందుకు తగ్గాట్టుగానే.. ఐ రిజిస్టర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యులతో అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు. ఇక ఊహించని విధంగా సడెన్ గా బాలాజీ మరణించడంతో.. ముందుగానే ఆయన అనుకున్న కలని సహాకరం కుటుంబ సభ్యులు సహాకారం చేశారు.

కాగా, డేనియల్‌ బాలాజీ మరణం తర్వాత.. ఆయన కళ్లను చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి వారు సేకరించి భద్రపరిచారు. అలాగే చూపులేని మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేసేందుకు సంబంధించిన ఆపరేషన్‌ పూర్తి అయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆయన భౌతికాయన్ని తిరువాన్మియూర్‌లోని తన స్వగృహానికి తరలించనున్నారు. కాగా, రేపు ఆయన నివాసంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. తాను సజీవంగా లేకపోయినా.. మరో ఇద్దరికి తన కళ్లను దానం చేసిన మంచి హృదయం డేనియల్ బాలాజీది అని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇక డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు.  అయితే ఈయనకు యాక్టింగ్‌లోకి రాకముందు సినిమాలకి యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలాజీ.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అద్భుతంగా నటించారు.  కాగా, కమల్ హాసన్ ‘రాఘవన్’ సినిమాలో అయితే డేనియల్ నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. మరి, తాను చనిపోతూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగును నింపిన డేనియల్ బాలాజీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.