iDreamPost
android-app
ios-app

మెగాస్టార్‌ బర్త్‌డే.. విషెస్‌ చెప్పిన క్లీన్‌కారా

  • Published Aug 22, 2023 | 12:37 PM Updated Updated Aug 22, 2023 | 12:37 PM
  • Published Aug 22, 2023 | 12:37 PMUpdated Aug 22, 2023 | 12:37 PM
మెగాస్టార్‌ బర్త్‌డే.. విషెస్‌ చెప్పిన క్లీన్‌కారా

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే నేడు. గత నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి. కొత్త వాళ్లు ఎందరు వచ్చినా.. చిరు క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస చిత్రాల్లో నటిస్తూ.. బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నారు చిరంజీవి. ఇక వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఎంతో గ్రాండ్‌గా స్టార్ట్‌ చేశారు చిరంజీవి. కొన్ని రోజుల క్రితమే ఆయన భోళా శంకర్‌ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు.

చిరంజీవి బర్త్‌డే నేపథ్యంలో మరో ముఖ్యమైన వ్యక్తి.. సోషల్‌ మీడియాలో మెగాస్టార్‌కి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఇంతకు అంత ఇంపార్టెటెంట్‌ పర్సన్‌ ఎవరంటే.. మెగా వారసురాలు.. క్లీన్‌కారా. మనవరాలు వచ్చాక తొలి బర్త్‌డే జరుపుకుంటున్నారు చిరంజీవి. ఈ క్రమంలో తాత పుట్టిన రోజు సందర్భంగా చిన్నారి క్లీన్‌ కారా బర్త్‌డే విషెస్‌ తెలిపింది. అంటే మెగా ప్రిన్సెస్‌ తరఫున రామ్‌చరణ్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి క్లీన్‌ కారాని ఎత్తుకున్న చిరంజీవి ఫొటోని షేర్‌ చేశాడు రామ్‌ చరణ్‌. అయితే ఇందులో క్లీన్‌కారా ముఖం మాత్రం రివీల్‌ చేయలేదు.

ఫొటోతో పాటు.. ‘‘మా ప్రియాతిప్రియమైన చిరుత(చిరంజీవి తాత)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కొణిదెల కుటుంబంలోని చిన్ని యువరాణితో పాటు మా అందరి తరఫున అమితమైన ప్రేమతో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం’’ అంటూ ట్వీట్‌ చేశాడు రామ్‌ చరణ్‌. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş