iDreamPost
android-app
ios-app

ఓ ఇంటి వాడైన కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ!

ప్రముఖ కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పెళ్లి, ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రముఖ కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పెళ్లి, ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ ఇంటి వాడైన కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ!

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కిర్రాక్‌ ఆర్పీ. ప్రముఖ కామెడీ షో ‘జబర్థస్త్‌’తో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్పీ. తన కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీ, మ్యానరిజంతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. బుల్లి తెరలో పలు కామెడీ షోలలో భాగమయ్యారు. పలు సినిమాల్లో కూడా నటించారు. పలువురు స్టార్‌ హీరోల సినిమాల్లో చేశారు. అనుకోని కారణాల వల్ల ఆర్పీ నటనకు బ్రేక్‌ ఇచ్చారు.

‘నెల్లూరు చేపల పులుసు’ అనే హోటల్‌ను పెట్టారు. హెటల్‌ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నెల్లూరు చేపల పులుసుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. కిరాక్‌ ఆర్పీ ఓ ఇంటివాడు అయ్యారు. తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్నతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం వైజాగ్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు సినీ సెలెబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ పెళ్లి వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కోచింగ్‌ సెంటర్‌లో లవ్‌ యాట్‌ ఫస్ట్‌ సైట్‌!

లక్ష్మీ ప్రసన్న ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌ సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకుంటూ ఉండేది. ఓ సారి ఆర్పీ ఆ ఇన్‌స్టిట్యూట్‌కు గెస్ట్‌గా వెళ్లారు. అప్పుడు లక్ష్మీ ప్రసన్నను చూశారు. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయారు. లక్ష్మీ ప్రసన్న నెంబర్‌ అడిగారు. ఆమె తన తల్లి ఫోన్‌ నెంబర్‌ను ఆయనకు ఇచ్చారు. ఆర్పీ మొదటి లక్ష్మీ తల్లితో మంచి అనుబంధాన్ని కొనసాగించారు. ఓ సంవత్సరం పాటు లక్ష్మీ తల్లితోటే ఆర్పీ ట్రావెల్‌ చేశారు. ఈ సంవత్సరంలో లక్ష్మీతో పెద్దగా మాట్లాడలేదు.

తన ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లడానికి వైజాగ్‌లో ఉన్న లక్ష్మీ ఇంటికి తరచుగా వెళ్లే వారు. ఆమె కుటుంబంతో అనుబంధం పెంచుకున్నారు. ఫ్యామిలీకి మొదట దగ్గర అయ్యి.. తర్వాత ఆమెకు దగ్గరయ్యారు. అయితే, ఆర్పీ పెళ్లి ప్రపోజల్‌ పెట్టినపుడు.. సినిమా వాడన్న కారణంతో మొదట ఒప్పుకోలేదు. దాదాపు రెండేళ్లు ఓపిగ్గా పోరాటం చేసి ఆర్పీ.. లక్ష్మీ కుటుంబ సభ్యుల్ని పెళ్లికి ఒప్పించారు. 2022 మే నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అప్పట్లో వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. మరి, కిరాక్‌ ఆర్పీ పెళ్లి బంధంతో ఓ ఇంటి వాడు కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler