iDreamPost
android-app
ios-app

హీరోయిన్ తో లవ్ మ్యాటర్.. దొరికిపోయిన కిరణ్ అబ్బవరం!

  • Author ajaykrishna Updated - 04:54 PM, Fri - 27 October 23

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ ఎవరితో లవ్ లో ఉన్నారు? ప్రెజెంట్ సింగిలా కాదా? లాంటి విషయాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు ఫ్యాన్స్. సెలబ్రిటీలు దాదాపుగా ఓపెన్ అవ్వరు. కానీ.. యంగ్ హీరో ఓ షోలో పాల్గొని తన లవర్ మ్యాటర్ చెప్పకనే చెప్పేశాడట.

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ ఎవరితో లవ్ లో ఉన్నారు? ప్రెజెంట్ సింగిలా కాదా? లాంటి విషయాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు ఫ్యాన్స్. సెలబ్రిటీలు దాదాపుగా ఓపెన్ అవ్వరు. కానీ.. యంగ్ హీరో ఓ షోలో పాల్గొని తన లవర్ మ్యాటర్ చెప్పకనే చెప్పేశాడట.

  • Author ajaykrishna Updated - 04:54 PM, Fri - 27 October 23
హీరోయిన్ తో లవ్ మ్యాటర్.. దొరికిపోయిన కిరణ్ అబ్బవరం!

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ కి సంబంధించి లవ్, క్రష్ లాంటి విషయాలు ఏమైనా తెలిస్తే ఫ్యాన్స్ ఎంత హ్యాపీ అవుతారో తెలిసిందే. తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్స్ ఎవరిని ఇష్టపడుతున్నారు? ఎవరితో లవ్ లో ఉన్నారు? ప్రెజెంట్ సింగిలా కాదా? లాంటి విషయాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ కాబట్టి.. సెలబ్రిటీలు దాదాపుగా ఓపెన్ అవ్వరు. సీక్రెట్ గానే నడిపించి.. అంత సెట్ అనుకున్నప్పుడు వాళ్లంతట వాళ్లే అనౌన్స్ చేసేస్తుంటారు. కానీ.. వాళ్ళ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఫ్యాన్స్ ఊరుకోరుగా.. ఏదొక విధంగా కనిపెట్టే పనిలో ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో ఓ షోలో పాల్గొని తన లవర్ మ్యాటర్ చెప్పకనే చెప్పేశాడని తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. యంగ్ కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అవసరం లేదు. హిట్స్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్, క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు కిరణ్. అదే సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది రహస్య గోరఖ్. ఫస్ట్ సినిమాలోనే వీరి పెయిర్, కెమిస్ట్రీ మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే.. ఆ సినిమా టైమ్ లో మంచి ఫ్రెండ్స్ అయిన కిరణ్, రహస్య.. ప్రేమలో పడ్డారని కొన్నాళ్ళు వార్తలు వినిపించాయి.

ఆ వార్తలకు ఇద్దరు స్పందించకపోవడంతో.. వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. కట్ చేస్తే.. కొంతకాలం తర్వాత ఇద్దరు కలిసి వేకెషన్ కి వెళ్లారు. ఎవరికి వారే వెళ్ళినప్పటికి.. ఒకేరోజు ఇద్దరు ఒకే ప్లేస్ లో పిక్స్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో మళ్ళీ లవ్ బర్డ్స్ అంటూ ప్రచారం మొదలైంది. ఆ తర్వాత కిరణ్ వాళ్ళ గృహప్రవేశం వేడుకలో కూడా రహస్య మెరిసింది. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ ఉందని.. బయట పడట్లేదని అనుకున్నారు. ఇదే విషయమై తాజాగా ఓపెన్ అయిపోయాడు కిరణ్. అదెలాగంటే.. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి హోస్ట్ గా ‘దావత్’ అనే ప్రోగ్రాం మొదలైంది. ఈ ప్రోగ్రాంలో కిరణ్ ఫస్ట్ గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో.. రహస్య, మీరు రిలేషన్ లో ఉన్నారా? అని అడిగింది అషు. దానికి.. అలాంటిదేమి లేదని, ఏదైనా ఉంటే చెప్తామని అన్నాడు కిరణ్. ఆ వెంటనే.. చెప్తాం అన్నారంటే ఇద్దరు ఒకేసారి అనౌన్స్ చేస్తారా? అంది అషు. దీంతో సిగ్గుపడుతూ.. ‘నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎప్పుడూ ఇలా దొరికిపోలేదు’ అని చెప్పాడు. అలా రహస్య, కిరణ్ లవ్ లో ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యిందని ఫ్యాన్స్, నెటిజన్స్ భావిస్తున్నారు. మరి కిరణ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş