Kiran Abbavaram Marriage: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం-రహస్య! వీడియో వైరల్..

Kiran Abbavaram Marriage Photos, Videos: 'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ల జంట పెళ్లితో ఒక్కటైంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Kiran Abbavaram Marriage Photos, Videos: 'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ల జంట పెళ్లితో ఒక్కటైంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో గురువారం(ఆగస్ట్ 22)న మూడుముళ్ల బంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది. కర్ణాటకలోని కూర్గ్  లో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ల జంట పెళ్లితో ఒక్కటైంది. కర్ణాటకలోని కూర్గ్ లో ఓ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ మ్యారేజ్ కు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా.. తొలి సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 5 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. కానీ, ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడి ఇటీవలే ఎంగేజె మెంట్ చేసుకుని అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ తర్వలోనే రిలీజ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది ‘క’ మూవీ. ఇక పెళ్లితో ఒక్కటైన ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Show comments