Kiran Abbavaram-Rahasya Gorak Pre Wedding Celebrations: గ్రాండ్‌గా హీరో కిరణ్‌ అబ్బవరం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌..

Kiran Abbavaram: గ్రాండ్‌గా హీరో కిరణ్‌ అబ్బవరం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌..

Kiran Abbavaram Pre Wedding Celebrations: కిరణ్‌ అబ్బవరం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

Kiran Abbavaram Pre Wedding Celebrations: కిరణ్‌ అబ్బవరం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

ఎలాంటి సినీ నేపథ్యం, బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ వంటి హిట్టు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినిమా రిజల్ట్‌తో పని లేకుండా.. వరుస మూవీలు చేస్తూ.. కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఇక హీరోగా యాక్ట్‌ చేస్తూనే.. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అటు హీరోగా.. ఇటు ప్రొడక్షన్‌ ఫీల్డ్‌లో రాణిస్తూ.. కెరీర్‌లో ఫుల్లు బిజీగా ఉన్న కిరణ్‌ అబ్బవరం.. పర్సనల్‌ లైఫ్‌లో కూడా హ్యాపీ మూమెంట్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇప్పటికే తన మొదటి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌ని ఈ ఏడాది మార్చి 13 నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి. తాజాగా వీరి ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కిరణ్‌ అబ్బవరం-రహస్య గోరక్‌ల వివాహం ఆగస్టు 22న జరగబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వీరిద్దరూ డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని టాక్‌. ముందుగా కేరళలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అక్కడ వరదలతో పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ క్రమంలో కర్ణాటకకు షిఫ్ట్‌ అయ్యారని సమాచారం. కూర్గ్‌లో కిరణ్‌ అబ్బవరం-రహస్యల వివాహం జరగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా కిరణ్‌-రహస్యల పెళ్లి వేడుకలో భాగంగా సంగీత్‌ వేడుక నిర్వహించారు. దీనిలో ఇరువురు ఫ్యామిలీ మెంబర్స్‌ సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను రహస్య తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అలాగే కాబోయే భర్తతో కలిసి ప్రత్యేక పూజలు ఆచరిస్తోన్న ఫొటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ప్రీవెడ్డింగ్‌ వేడుకులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రాజా వారు రాణి గారు సినిమాలో కిరణ్‌ అబ్బవరం-రహస్యలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కే వరకు వచ్చింది. మూవీ సమయంలో వీర్దిదరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. ఇన్నాళ్లు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై వారు ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఈ ఏడాది మార్చి 13న ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని.. తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

Show comments