Dharani
Kiran Abbavaram Rahasya Gorak Marriage: మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అతడి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
Kiran Abbavaram Rahasya Gorak Marriage: మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అతడి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
Dharani
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి.. భిన్నమైన కథలు ఎన్నకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా.. వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత రాజా వారు రాణి వారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎస్‌ఆర్ కల్యాణ్ మండపం అనే భారీ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆపై వరుసగా సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యం విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ ఇలా అరడజనుకు పైగా సినిమాలు చేశాడు. ప్రస్తుతం క అనే విభిన్నమైన కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నాడు.
కెరీర్ సంగతి పక్కకు పెడితే.. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా హ్యాపీ మూవ్‌మెంట్స్ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే తన ప్రియురాలు రహస్య గోరఖ్‌ని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆగస్టు 22న అనగా రేపు గురువారం నాడు వీరి వివాహం జరగనుంది. మరి కొన్ని గంటల్లో వీరిద్దరు వైవాహిక బంధంలోకి ప్రవేశించబోతున్నారు. కర్ణాటకలోని కూర్గ్‌లో కిరణ్, రహస్యల వివాహం జరగనుందని సమాచారం. వివాహానికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో వధూవరులిద్దరూ బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కాబోయే పెళ్లి కూతురు రహస్య తమ వివాహ వేడుకలకు సంబంధించి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు కాబోయే వరుడు హీరో కిరణ అబ్బవరం పెళ్లి దుస్తుల్లో మురిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి నేపథ్యంలో.. పలువులు సినీ ప్రముఖులు, అభిమానులుకాబోయే దంపతులకు ముందుగానే అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కిరణ్, రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు. ఈ సినిమా సెట్స్‌లోనే తొలిసారి ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇక గత ఐదేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇటీవలే మార్చ్‌లో నిశ్చితార్థం చేసుకుని.. అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వివాహం బంధంతో ఈ ప్రేమికులిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.