iDreamPost
android-app
ios-app

కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే.. ఇలా ఎక్స్ పెక్ట్ చేసుండరు!

  • Published Jul 10, 2024 | 12:27 PM Updated Updated Jul 10, 2024 | 12:27 PM

Kiran Abbavaram New Movie Title Poster Released: టాలీవుడ్ యంగ్ హహీరో కిరణ్ అబ్బవరం నుంచి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. చాలా కొత్తగా అలాగే.. సింగిల్ లెటర్ తో ఈ టైటిల్ ఉండటం విశేషం.

Kiran Abbavaram New Movie Title Poster Released: టాలీవుడ్ యంగ్ హహీరో కిరణ్ అబ్బవరం నుంచి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. చాలా కొత్తగా అలాగే.. సింగిల్ లెటర్ తో ఈ టైటిల్ ఉండటం విశేషం.

  • Published Jul 10, 2024 | 12:27 PMUpdated Jul 10, 2024 | 12:27 PM
కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే.. ఇలా ఎక్స్ పెక్ట్ చేసుండరు!

కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ మూవీస్ చేసిన యంగ్ హీరో ఇతనే. అలాగే ఎక్కువగా ట్రోల్స్ కి గురయ్యేది కూడా కిరణ్ అబ్బవంరం అని చెప్పచ్చు. కానీ, నీమీద రాళ్లేస్తే వాటితో ఇల్లు కట్టుకో అని మోటివేటర్స్ చెప్తూ ఉంటారు. నిజ జీవితంలో దానిని చేసి చూపించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పచ్చు. కామెంట్స్, ట్రోల్స్, పొగడ్తలు ఇలా దేన్నీ పట్టించుకోకుండా.. తన సినిమాలు తాను చేసుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. తాజాగా ఒక పిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఇన్నాళ్లు కిరణ్ అబ్బవరం విషయంలో కామన్ గా ఒక ట్రోలింగ్ అయితే చూస్తూ ఉండేవాళ్లం. అదేంటంటే.. సినిమాల సెలక్షన్ విషయంలో ఎక్కువ మంది కామెంట్స్ చేసేవాళ్లు. అయితే ఇన్నాళ్లు ట్రోలింగ్స్ ని కిరణ్ అబ్బవరం సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈసారి మాత్రం ట్రోలింగ్స్ ని కాస్త గట్టిగానే పట్టించుకున్నట్లు ఉన్నాడు. అది ఎలా చెప్పగలం అంటే తాను ఇన్నాళ్లు లవబుల్ రోల్స్ చేశాడు. కానీ, ఈసారి మ్యాజికల్ వరల్డ్ ని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో యాక్షన్ మాత్రమే కాదు.. అంతకు మించిన ఎన్నో అద్భుతాలు ఉంటాయని విషయాన్ని తన పోస్టర్ తో రివీల్ చేశాడు.

ఈ సినిమాకి ‘KA- క’ అనే టైటిల్ పెట్టాడు. పోస్టర్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందులో కిరణ్ అబ్బవరం బ్యాక్ షాట్ ఉంది. టైటిల్ కి మాత్రం ప్రాచీన భాష, మంత్రాలు, తంత్రాలు ఉండేలా డిజైన్ చేశారు. దాని పైన ‘క’ అని పెట్టారు. మీ అందరికీ క ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాం అంటూ ఈ టైటిల్ పోస్టర్ ని కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ఈ పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాతో కిరణ్ అబ్బవరం కూడా ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ లేదా.. అక్టోబర్ నెలలో విడుదల చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీ తెలుగులోని కాకుండా.. తమిళ్, మలయాళం, కన్నడలో కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు. మరి.. కిరణ్ అబ్బవరం ‘క’ టైటిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş