iDreamPost

సుదీప్ మంచి మనస్సు.. అభిమాని కష్టం తెలుసుకుని! హ్యాట్సాఫ్ సర్!

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రీల్ హీరో మాత్రమే రియల్ హీరో కూడా. కిచ్చా సుదీప ఛారిటబుల్ సొసైటీ పేరుతో నిరుపేద పాఠశాల పిల్లలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాడు. తాాజాగా

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రీల్ హీరో మాత్రమే రియల్ హీరో కూడా. కిచ్చా సుదీప ఛారిటబుల్ సొసైటీ పేరుతో నిరుపేద పాఠశాల పిల్లలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాడు. తాాజాగా

సుదీప్ మంచి మనస్సు.. అభిమాని కష్టం తెలుసుకుని! హ్యాట్సాఫ్ సర్!

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ మూవీలో తనదైన విలనిజం పండించి.. మెస్మరైజ్ చేశాడు ఈ శాండిల్ వుడ్ స్టార్ హీరో. అంతకు ముందు రక్త చరిత్ర బైలింగ్వల్ మూవీలో నటించి ఆకట్టుకున్నాడు. అందులో డీసీపీ మోహన్ ప్రసాద్ పాత్ర పోషించాడు సుదీప్. ఈగ తర్వాత బాహుబలిలో కూడా కనిపించాడు. ఆ తర్వాత నుండి అతడి సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. ఎంతో కొంత మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు సుదీప్. సైరా నరసింహా రెడ్డి తర్వాత ఆయన టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించలేదు. గత ఏడాది విక్రాంత్ రోణతో పలకరించిన ఈ స్టార్ నటుడు.. ఈ ఏడాది మాక్స్ మూవీతో రాబోతున్నాడు.

సుదీప్ అనగానే.. ఇక్కడ విలన్, స్పెషల్ క్యారెక్టర్ చేసే వ్యక్తిగా మాత్రమే పేరుంది. కానీ శాండిల్ వుడ్ ప్రేక్షకులకు అతడో దేవుడు. ఆయన రీల్ హీరో మాత్రమే రియల్ హీరో కూడా. కిచ్చా సుదీప ఛారిటబుల్ సొసైటీ పేరుతో నిరుపేద పాఠశాల పిల్లలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాడు. యూనిఫామ్స్.. స్కాలర్ షిప్స్ అందిస్తోంది ఈ సంస్థ. కోవిడ్ మహమ్మారి సమయంలో.. ఇండస్ట్రీలో పని దొరకని సమయంలో ఈ ట్రస్ట్ కొంత మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులు, ఇతరులకు అవసరమైన సాయం అందించింది. సుదీప్ అన్నా అని పిలవాలే తగిన సాయం చేస్తుంటాడు సుదీప్. మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడు.

తాజాగా తన కోసం వచ్చిన ప్రత్యేక అభిమానిని కాదనకుండా కలిసి.. అతడికి ఆర్థిక సాయం అందించాడు. సుదీప్ అంటే విపరీతంగా ఇష్టపడే ఓ అభిమాని.. అతడి వద్దకు వచ్చి ఓ లేఖను అందించాడు. అతడికి మాటలు రావు. అతడి కష్టాన్ని గుర్తించి.. ఆ లేఖలో ఉన్న మ్యాటర్ చదివిన సుదీప్.. ఒక్క నిమషం ఆలోచించకుండా వెంటనే ఆర్థిక సాయం అందించాడు. అంతేకాకుండా అతడికి తన ఇంట్లోనే భోజనం పెట్టి పంపించాడు. తిని వెళ్లమని అతడికి చెప్పాడు ఈ కన్నడ సూపర్ స్టార్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక సుదీప్ సినిమాల విషయానికి వస్తే.. మాక్స్‪తో పాటు మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. బిల్లా రంగా భాషా, కబ్జా 2తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు స్టార్ నటుడు. ఈ నాలుగు మూవీలతో ఆయన 50 పిక్చర్స్ పూర్తి చేసినట్లు అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి