iDreamPost
android-app
ios-app

త్వరగా మాతృత్వాన్ని ఆస్వాదించాలి! వైరల్ గా మారిన కియారా కామెంట్స్!

  • Author ajaykrishna Updated - 08:15 PM, Mon - 31 July 23
  • Author ajaykrishna Updated - 08:15 PM, Mon - 31 July 23
త్వరగా మాతృత్వాన్ని ఆస్వాదించాలి! వైరల్ గా మారిన కియారా కామెంట్స్!

సాధారణంగా అభిమాన హీరోలకు పెళ్లి జరిగితే ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని చూస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఫేవరేట్ హీరోయిన్స్ కి పెళ్లిళ్లు జరిగితే ఊరుకుంటారా.. వాళ్ల విషయంలో కూడా అంతే. అయితే.. పెళ్లి అయ్యాక హీరోలకంటే హీరోయిన్స్ కెరీర్ పట్ల ఆలోచనలతో.. ప్రెగ్నెన్సీ వైపు దృష్టి పెట్టరు. అలాగని కొంతకాలం తర్వాత అయినా గుడ్ న్యూస్ చెబుతారేమో అనుకుంటే అదీ లేదు. ఎందుకంటే.. ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలు చేసేయాలి.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే మైండ్ సెట్ తో తొందరగా పిల్లల గురించి ఆలోచన చేయకపోవచ్చు. అందరు ఇలాగే ఆలోచిస్తారని చెప్పలేం. ఎక్కువ శాతం అయితే అలాగే ఆలోచిస్తారు.

అలా కాకుండా పెళ్లి కాకుండానే మాతృత్వాన్ని ఆస్వాదించాలి అనుకునేవారు కొందరు ఉంటారు. అంటే.. కెరీర్ ఫామ్ లో ఉండి.. చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆ కోవకే చెందుతుంది. భరత్ అనే నేను మూవీతో.. మహేష్ బాబుకు జోడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయం ఖాతాలో వేసుకుంది. ఒక్క సినిమాతోనే తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే.. ఆ తర్వాత రామ్ చరణ్ కి జంటగా నటించిన.. వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. పూర్తిగా బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది.

కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తోంది. అంటే దాదాపు నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. 2019లో కియారా అద్వానీ ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెగ్నెన్సీ గురించి కామెంట్స్ చేసింది. తనకు వీలైనంత త్వరగా మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఉందంటూ కియారా చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే.. ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గా తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంది. దీంతో ఇప్పుడు ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి.. కియారా ప్రెగ్నెన్సీ కోసం చాలా వెయిట్ చేస్తున్నట్లుంది.. పెళ్లి కాకుముందే అలా అంది అంటే.. ఖచ్చితంగా త్వరలో గుడ్ న్యూస్ చెబుతుంది అని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి కియారా అద్వానీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom