iDreamPost
android-app
ios-app

కార్తీ నుండి ఖైదీ 2 అప్డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

  • Published Mar 02, 2024 | 1:51 PM Updated Updated Mar 02, 2024 | 1:51 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన మూవీ ఖైదీ. కోలీవుడ్ లోనే కాదూ.. టాలీవుడ్ లో కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన మూవీ ఖైదీ. కోలీవుడ్ లోనే కాదూ.. టాలీవుడ్ లో కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

  • Published Mar 02, 2024 | 1:51 PMUpdated Mar 02, 2024 | 1:51 PM
కార్తీ నుండి  ఖైదీ 2 అప్డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

తమిళ స్టార్ యాక్టర్ కార్తీ – సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా ఆడియెన్స్ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సీక్వెల్స్ లో ఖైదీ 2 ఒకటి. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) నుండి తమ అభిమాన పాత్ర డిల్లీని మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. తాజాగా కార్తీ ఖైదీ 2 గురించి అప్డేట్ ఇచ్చారు.

ఒక పబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఖైదీ 2 గురించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు కార్తీ. ఖైదీ సినిమాలో అయన డిల్లీ అనే మాజీ క్రిమినల్ పాత్రను పోషించారు. జైల్ నుంచి బయటకు వచ్చి కూతురిని కలవాల్సిన సమయంలో డిల్లీకి అనుకోకుండా డ్రగ్ కార్టెల్‌ను ఛేదించడంలో పోలీసు అధికారులకు సహాయం చేయాల్సి వస్తుంది. ఇటీవల కార్తీ హాజరైన ఒక కార్యక్రమంలో, డిల్లీ డైలాగ్‌ను గుర్తు చేస్తూ, ” నేను పదేళ్లు జైలులో ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. కానీ అంతకు ముందు నేనేం చేసేవాడినో మీకు తెలియదు” అనే డైలాగ్ చెప్పారు. కాగా వచ్చే ఏడాది. ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తామని తెలిపారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ, LCUలో మొదటి సినిమా.

కార్తీ కెరీర్‌లో కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా ఖైదీ నిలిచింది. ఆ తరువాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్‌లో చివరి సీన్ లో డిల్లీ పాత్ర వాయిస్‌ మాత్రమే వినిపించిగా అది సీక్వెల్ పై ఆసక్తిని మరింత పెంచింది. ఖైదీ 2 డిల్లీ పాత్రకు ప్రీక్వెల్ గా ఉంటుంది. ఆ పాత్ర క్రైమ్ కార్టెల్ తో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది చూపిస్తారు. కార్తీ చివరిసారిగా రాజు మురుగన్ జపాన్‌ సినిమాలో కనిపించారు. ఖైదీ 2 వంటి ఇంట్రెస్టింగ్ సీక్వెల్‌ తో పాటు పీ ఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సర్దార్ సినిమా సీక్వెల్ లో కూడా పని చేయనున్నారు. అలాగే దర్శకుడు హెచ్‌ వినోద్ తో కలిసి నటుడి ధీరన్ అధిగారం ఒండ్రు (ఖాకీ) సినిమాకు కూడా సీక్వెల్‌ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.

Jojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetStarzbetMadridbetcratosroyalbetmatbet girişjojobetgrandpashabet girişdeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişCasibomJojobet Girişcasibom girişDeneme Bonusu Veran Siteler 2026jojobet girişjojobetjojobet girişjojobet girişcasino sitelericasibom