iDreamPost
android-app
ios-app

KGF Star Yash: ఏడాది ఎదురు చూసి ఇలా చేశావేం రాఖీ భాయ్‌..?

  • Published Dec 05, 2023 | 7:56 PM Updated Updated Dec 05, 2023 | 7:56 PM

కేజీఎఫ్‌ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగిన యశ్‌ తన తదుపరి సినిమాను ఏడాదిన్నర తర్వాత ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సమయంలో ఆయన ఫ్యాన్స్ కొందరు అసంతృప్తిలో ఉన్నారు.

కేజీఎఫ్‌ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగిన యశ్‌ తన తదుపరి సినిమాను ఏడాదిన్నర తర్వాత ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సమయంలో ఆయన ఫ్యాన్స్ కొందరు అసంతృప్తిలో ఉన్నారు.

  • Published Dec 05, 2023 | 7:56 PMUpdated Dec 05, 2023 | 7:56 PM
KGF Star Yash: ఏడాది ఎదురు చూసి ఇలా చేశావేం రాఖీ భాయ్‌..?

రాఖీ భాయ్‌… కేజీఎఫ్‌ తర్వాత కన్నడ హీరో యశ్‌ ను ఎక్కువగా ఈ పేరుతోనే అభిమానులు, సోషల్ మీడియా జనాలు పిలుచుకుంటూ ఉన్నారు. కేజీఎఫ్‌ సినిమాకు ముందు వరకు యశ్ ఒక కన్నడ హీరో. అది కూడా టైర్- 2 కన్నడ హీరో. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పుడే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్‌ అంటూ ఆయన అభిమానులు ఆకాశానికి ఎత్తారు. ఏ హీరో అయినా తనకు వచ్చిన అంతటి విజయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. కానీ కేజీఎఫ్‌ 2 విడుదలై ఏడాదిన్నర అయినా కూడా తదుపరి సినిమా ప్రకటించక పోవడంతో ఆయన ఆ సినిమా తాలూకు ఇమేజ్ ను వథా చేసుకుంటూ ఉన్నాడు అంటూ చాలా మంది ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత ఆ స్థాయితో మీ ముందుకు రావడం కోసం మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ పలు సందర్భాల్లో యశ్‌ చెప్పడం మనం చూశాం. ఇదుగో యశ్‌ సినిమా ప్రకటన, అదుగో యశ్‌ కొత్త సినిమా ప్రకటన అంటూ మీడియా లో పలు సార్లు కథనాలు రావడం, ఆ వార్తలు నిజం కాదు అంటూ యశ్‌ నుంచి ప్రకటన రావడం మనం చూస్తూనే ఉన్నాం.

ఎంత ఆలస్యం అయితే అంత ఫలితం ఉంటుందంటూ యశ్‌ పదే పదే చెబుతూ వచ్చాడు. దాంతో చాలా మంది కూడా మళ్లీ ప్రశాంత్ నీల్ వంటి స్టార్‌ దర్శకుడితో యశ్‌ సినిమా చేస్తాడని అంతా భావించారు. కాని యశ్‌ కొత్త సినిమా ప్రకటన చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు వెయిట్‌ చేసి పెద్దగా క్రేజ్ లేని లేడీ డైరెక్టర్ తో సినిమా కి కమిట్ అవ్వడం ఏంటి యశ్‌ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే యశ్‌ 19 సినిమా కన్ఫర్మ్‌ అయింది. గీతూ మోహన్ దాస్ అనే దర్శకురాలు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

గీతూ మోహన్ దాస్ ప్రతిభావంతురాలైన దర్శకురాలు అనడంలో సందేహం లేదు. కానీ యశ్‌ వంటి ఒక పాన్ ఇండియా కమర్షియల్‌ సూపర్ స్టార్‌ ను ఆమె ఎంత వరకు డీల్ చేయగలదు అంటూ కొందరు యశ్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రాఖీ భాయ్ ఇన్నాళ్లు వెయిట్‌ చేసి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇంతకు యశ్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి… యశ్‌ మరియు గీతూ మోహన్ దాస్ ల కాంబో మూవీ యశ్‌ 19 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు…?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ