iDreamPost
android-app
ios-app

KGF 3 – నిజంగా ఛాన్సుందా

  • Published Apr 14, 2022 | 3:38 PM Updated Updated Apr 14, 2022 | 3:38 PM
  • Published Apr 14, 2022 | 3:38 PMUpdated Apr 14, 2022 | 3:38 PM
KGF 3 – నిజంగా ఛాన్సుందా

ఈ రోజు రిలీజైన కెజిఎఫ్ చాప్టర్ 2 దేశవ్యాప్తంగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ లోనూ థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ప్రశాంత్ నీల్ చూపించిన హీరోయిజం, ఎలివేషన్లకు మాస్ ఫిదా అయిపోయారు. యాక్షన్ ఎపిసోడ్ల గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు.

ఇక క్లైమాక్స్ లో ఎండ్ టైటిల్స్ అయ్యాక కెజిఎఫ్ చాప్టర్ 3కి సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూ ఇవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. రాఖీ భాయ్ పాత్రకు ముగింపు అయిపోయింది కాబట్టి ఎలా సాధ్యమనే డౌట్ రావడం సహజం. అయితే చనిపోవడానికి ముందు రాఖీ అమెరికా వెళ్లే ట్రాక్ ఒకటుంటుంది. ఇది చివర్లో చిన్న సీన్ లో రెండు మూడు పాత్రల ద్వారా చెప్పించాడు ప్రశాంత్ నీల్

అక్కడికి వెళ్లి రాఖీ ఏం చేశాడు, యుఎస్ పోలీసులు అతని కోసం ఇండియా ఎందుకు వచ్చారు లాంటి వాటితో థర్డ్ పార్ట్ తీయొచ్చు. కానీ ప్రశాంత్ ప్రస్తుతం సలార్ తో బిజీ అయ్యాడు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు ఉంటుంది. ఆపై రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఇన్ని కమిట్ మెంట్స్ మధ్య కెజిఎఫ్ 3కి పాజిబిలిటీ తక్కువే. పైగా హీరో యష్ అంతకాలం వెయిట్ చేస్తారా. కష్టమే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss