Swetha
ప్రస్తుతం ప్రేక్షకులకు మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కూలీ సినిమానే. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్ళింది. దీనితో ట్రైలర్ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు కాస్త తారు మారు అయ్యాయి.
ప్రస్తుతం ప్రేక్షకులకు మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కూలీ సినిమానే. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్ళింది. దీనితో ట్రైలర్ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు కాస్త తారు మారు అయ్యాయి.
Swetha
ప్రస్తుతం ప్రేక్షకులకు మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కూలీ సినిమానే. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్ళింది. దీనితో ట్రైలర్ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు కాస్త తారు మారు అయ్యాయి. ట్రైలర్ ను కేవలం క్యారెక్టర్స్ ను పరిచయం చేయడానికే వదిలినట్టు ఉన్నారు అనే టాక్ వచ్చింది. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు శృతిహాసన్ క్యారెక్టర్ గురించి బజ్ వినిపిస్తుంది.
మిగిలిన అన్ని సినిమాలలోలా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాదు. ఈ సినిమాలో ఈమెది కూడా కీ రోల్ అంట. సినిమాలోని మెయిన్ ట్విస్ట్ లన్ని ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయట. ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం సినిమాలో సత్యరాజ్ కూతురిగా శృతిహాసన్ నటించింది. సత్యరాజ్ హార్బర్ లో జరిగే మాఫియా సీక్రెట్స్ ను వెతికి తీసే పనిలో ఉంటాడు. ఈ క్రమంలోనే రజిని కాంత్ తో స్నేహం ఏర్పడుతుంది. కానీ ఉన్నట్టుండి ఇద్దరు మాయమైపోతారు, దీనితో శృతిహాసన్ తండ్రిని వెతికే పనిలో ఉంటుంది. ఈ ప్రాసెస్ లో నాగార్జున డార్క్ సైడ్ బయట పడుతుంది. దీనితో ఆమె ప్రాణాలకు హాని కలుగుతుంది.
సరిగ్గా అప్పుడే రజిని ఎంట్రీ ఇస్తాడు. కానీ తన తండ్రి మాత్రం కనిపించడు… దీనితో ఇద్దరు కలిసి సత్యరాజ్ ను వెతకడం మొదలుపెడతారు. ఇది ఆమె క్యారెక్టర్ గురించి మూవీ లవర్స్ డీకోడ్ చేసిన విషయాలు. వినడానికైతే బాగానే ఉంది . కానీ ఇంకా లో లోపల ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో ఆగష్టు 14 న తెలుస్తుంది. లోకేష్ మాత్రం సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.