Krishna Kowshik
సినిమాను పట్టిపీడిస్తున్నాయి పైరసీలు. థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లోకి ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ధనుష్ మూవీ రాయన్ కూడా దీని బారిన పడింది. ఓ థియేటర్ లో మూవీని రికార్డు చేస్తుండగా..
సినిమాను పట్టిపీడిస్తున్నాయి పైరసీలు. థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లోకి ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ధనుష్ మూవీ రాయన్ కూడా దీని బారిన పడింది. ఓ థియేటర్ లో మూవీని రికార్డు చేస్తుండగా..
Krishna Kowshik
ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి పైరసీలు. దీన్ని అరికట్టేందుకు ఇండస్ట్రీ మొత్తం కదిలినా కూడా ఎక్కడో ఓ చోట ఈ భూతం పట్టిపీడిస్తుంది. దీంతో నిర్మాతతో పాటు సినిమాలనే నమ్ముకుని బతుకుతున్న వందలాది మంది జీవితాలపై ప్రభావితం చూపుతుంది. చిన్న సినిమాల నుండి భారీ బడ్జెట్ చిత్రాల వరకు దీని బాధితులే. థియేటర్లలో రిలీజైన కొన్ని గంటలకే పైరసీ రూపంలో ఆన్ లైన్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ కూడా ఆ థియేటర్ ప్రింట్‌నే చూసి ఎంజాయ్ చేస్తూ, మరికొంత మందికి షేర్ చేస్తూ తీవ్ర నష్టానికి కారణమౌతున్నాడు. ఐ బొమ్మ, మూవీ రూల్జ్, తమిళ్ రాకర్స్ వంటి వెబ్ సైట్స్ కొత్త సినిమా కాపీలను అందిస్తున్నాయి. ఇలాంటి వెబ్ సైట్స్ వల్ల పెను సవాలుగా మారింది ఇండస్ట్రీకి.
ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్ నటించిన రాయన్ మూవీకి కూడా పైరసీ బారిన పడింది. ఈ నెల 26న థియేటర్లలో విడుదలైంది రాయన్. మంచి టాక్‌తో దూసుకెళుతుంది. అయితే ఈ మూవీ పైరసీ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. ఈ విషయంపై చిత్ర బృందం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీని వెనుక పైరసీ వెబ్ సైట్ తమిళ రాకర్స్ మాఫియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ సినిమాను కేరళలోని ఓ థియేటర్‌లో రికార్డు చేస్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులు. విచారించగా.. ఆ వెబ్ సైట్ అడ్మిన్ బెజ్ స్టీఫెన్ రాజ్‌గా గుర్తించారు. మధురైకి చెందిన స్టీఫెన్ రాజ్ కొత్త సినిమాలను అక్రమంగా ఆన్ లైన్లలో పొందుపరుస్తున్న తమిళ రాక్సర్‌లో ఒకరిగా గుర్తించారు.
తమిళ్ రాకర్స్‌కు పైరసీ వీడియోలు అందించడానికి రహస్యంగా పనిచేస్తున్నాడు స్టీఫెన్ రాజ్. సుమారు ఏడాదిన్నర కాలంగా తిరువనంతపురంలోని గెస్ట్‌హౌస్‌లో నివసిస్తున్నాడు. ఒక్కో సినిమాకు రూ. 5 వేలు వరకు తీసుకుంటాడని తేలింది.. అతడు థియేటర్‌లో పైరసీ చేసే విధానంపైనా పోలీసులకు కీలక వివరాలు అందించారు. సినిమా విడుదల రోజే ఆరు నుంచి ఏడు వెనక వైపు సీట్లను తమిళ్ రాకర్స్ సైట్ సభ్యులు బుక్ చేస్తారని, మొబైల్ ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్‌పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనుక సీట్లో కూర్చుని సినిమాని కాపీ చేస్తారని పోలీసులు వెల్లడించారు.
అనంతరం నిందితుడ్ని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. థియేటర్లలో రిలీజైన కొన్ని గంటలకే తమిళ రాకర్స్‌లో సినిమాలు వచ్చేస్తుంటాయి. కేవలం తమిళ సినిమాలే కాదు తెలుగు, మలయాళ చిత్రాలు కూడా ఇందులో ప్రత్యక్షమవుతుంటాయి. మలయాళ చిత్రం గురువాయురప్పన్ అంబలనడయిల్ విడుదలైన రోజే వచ్చేసింది. దీంతో నిర్మాతల్లో ఒకరైన సుప్రియా మీనన ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభాస్ కల్కి, మహారాజా వంటి చి త్రాలు కూడా స్టీఫెన్ రాజ్ రికార్డు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అతని ఫోనులో రికార్డింగ్ వీడియోలు కనిపించాయి.